వెనక నుంచి వస్తున్న ఆంబులెన్స్ శబ్దం చేస్తూ వస్తోంది. అందులో వున్న పేషంట్ అతని అటెండెంట్స్.. ఇబ్బందులు పడుతున్నారు. ట్రాఫిక్ జామ్ తీవ్రంగా వుంది. చావు బతుకులు మధ్య ఊగిసలాడుతున్న ఓ ప్రాణాని కాపాడేందుకు నడుంచుట్టాడు పదవీ విరమణ చేసిన ఓ మాజీ సైనికుడు. అతనిలోని మానవత్వం పరిమళించింది. అందరిలా తన పని తాను చేసుకోకుండా.. తాను నడుపుతున్న సైకిల్ ను పక్కన బెట్టి.. ఆంబులెన్స్ ట్రాపిక్ జామ్ లోంచి బయటపడేందుకు అడ్గుగా వున్న బ్యారికేడ్లను పక్కకు తీసి దారిని కల్పించాడు.
అంతే మాజీ సైనికుడి నాగప్పపై కాకీ కాఠిన్యం విరుచుకుపడింది. ఆయన చేసిన మంచి పనికి స్వాగతించాల్సింది పోయి.. తన వయస్సుకు కూడా గౌరవం ఇవ్వకుండా అక్కడ విధులు నిర్వహిస్తున్న ఎస్ రంగన్న నడిరోడ్డుపైనే దాడికి పాల్పడ్డాడు. మాజీ సైనికుడు నాగప్పను పట్టుకుని చితకబాదాడు. రెచ్చిపోయారు. ఆ సమయంలో కొందరు ఎస్ఐకి నచ్చచెప్పడానికి ప్రయత్నించారు. ఈ ఘటన నిన్న కర్నాటకలోని బెంగుళూరు కావేరి జంక్షన్ లో చోటుచేసుకుంది. దీనిని మీడియా తన కెమెరాలో బంధించడంతో కాకీల కాఠిన్యం బయటపడింది.
ఈ ఘటనపై బెంగళూరు నగర పోలీసు కమిషనర్ ఎం.ఎన్. రెడ్డి సీరియస్ అయ్యారు. ఎస్ఐ రంగన్న తప్పు చేశాడని, తాను క్షమాపణ చెబుతున్నానని అన్నారు అంబులెన్స్ కు దారి ఇవ్వడం ప్రతి ఒక్క పోలీసు, పౌరుడి కర్తవ్యం అని అన్నారు. నగరంలో అంబులెన్స్ సవ్యంగా వెళ్లడానికి అన్ని ఎర్పాట్లు చేస్తామని చెప్పారు. మాజీ సైనికుడు నాగప్ప మీద దాడి చేసిన ఎస్ఐ రంగన్నను సస్పెండ్ చేస్తున్నామని ఎం.ఎన్. రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. కాగా మాజీ సైనికుడు నాగప్ప చేసిన మంచి పనిని, అతనిలోని మానవత్వానికి ఇప్పడు దేశవ్యాప్తంగా సెల్యూట్ లు వెల్లివిసుర్తున్నాయి.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more