Telecom spectrum auction for 2g 3g

spectrum, bidding, 2g,3g, reliance,airtel, idea cellular, vodafone

The biggest-ever auction of 2G and 3G spectrum begins today and this is likely to fetch the government over Rs. 82,000 crore based on the reserve price.

సర్కారు వారి పాట.. ఒకటోసారి, రెండోసారి

Posted: 03/04/2015 11:00 AM IST
Telecom spectrum auction for 2g 3g

పాత సినిమాల్లో వేలం పాట గమ్మత్తుగా జరిగేది. సర్కార్ వారి పాట..ఒకటోసారి రెండోసారి..అంటూ బిల్ కలెక్టర్ స్థాయి ఉద్యోగి గంట కొట్టేవాడు. ఎవరు ఎక్కువ వేలం పాడితే వారికి ఆ హక్కులు వస్తాయి. దేశ చరిత్రలోనే మొదటిసారి అతి పెద్ద వేలం పాట మరి కొద్దసేపట్లో జరగనుంది. 2జి స్పెక్ట్రమ్ కు సంబందించిన గత ప్రభుత్వాలు తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నాయి. సంబందింత మంత్రి, అవినీతి పాల్పడిన వారు జైలుపాలయ్యారు. దాంతో ప్రభుత్వం ఈ సారి స్పెక్ట్రమ్ వేలాన్ని పూర్తి పారదర్శకతతో నిర్వహించేందుకు రంగం సిద్దం చేసుకుంది.

దేశంలో అతి పెద్ద వేలం పాట ఈ రోజు రాజధాని ఢిల్లీలో జరగనుంది. 2జి, 3జి స్పెక్ట్రమ్ ల వేలం పాట ద్వారా దాదాపు లక్ష కోట్లు పొందాలని ప్రభుత్వ సంకల్పించింది.  ప్రభుత్వం వద్ద 380.75 మెగాహెడ్జెస్ మూడు బ్యాండ్ లు, 900 మెగాహెడ్జ్ ల ప్రీమియం బ్యాండ్, 1800, 800 హెడ్జ్ లు ఉండగా, ఇవి దేశంలోని 22 టెలికాం సర్వీసుల్లో 17 ఏరియాలకు విస్తరించి ఉన్నాయి. 2100 మెగా హెడ్జు 3జి స్పెక్ట్రమ్ వేలం ప్రారంభ ధర 17,555 కోట్లు, 800, 900,1800 మెగా హెడ్జ్ లు 2 జి స్పెక్ట్రమ్ సర్కార్ వారి ధర 64,840 కోట్లు. ఇందులో ఎయిర్ టెల్, వోడాఫోన్, రిలయన్స్, ఐడియా సెల్లులార్ లు పాల్గొననున్నాయి. గత సంవత్సరం ఫిబ్రవరిలో జరిగిన వేలంలొ ప్రభుత్వం 62,162 కోట్ల రూపాయలను పొందింది. మరోపక్క బొగ్గు గనుల వేలం కూడా ఈ రోజే జరగనుంది. మొత్తానికి ఇవాళ రెండు వేలం పాటలతో ప్రభుత్వ ఖజానా నిండనుంది. అయితే స్పెక్ట్రమ్ వేలాన్ని ఎవరు స్వంతం చేసుకుంటారో అని దేశంలోని  కార్పోరేట్ వర్గాలు ఎదురు చూస్తున్నాయి.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : spectrum  bidding  2g  3g  reliance  airtel  idea cellular  vodafone  

Other Articles