Woman drugged gang raped five including cops son muzaffarnagar

woman gang raped in muzaffarnagar, woman gang raped in uttar pradesh, woman drugged gang raped in uttar pradesh, woman drugged gang raped in muzaffarnagar, woman gang raped five including cops son, violence on women, violence against women, crime against women

A 26-year-old woman was allegedly drugged and gang-raped in Muzaffarnagar by five youth, including the son of a sub-inspector, police said on Sunday.

మహిళపై గ్యాంగ్ రేప్.. మగమృగాళ్లలో ఎస్ఐ కొడుకు..

Posted: 03/01/2015 05:59 PM IST
Woman drugged gang raped five including cops son muzaffarnagar

ఉత్తరప్రదేశ్‌లో మరో దారుణం జరిగింది. 26 ఏళ్ల మహిళపై మగ మృగాళ్లు గ్యాంగ్ రేపు పాల్పడ్డారు. నేరాలకు అడ్డాగా మారిన ఉత్తర్ ప్రదేశ్ లో అనేక అనాగరిక చర్యలు చేటుచేసుకుంటున్నాయి. ఇక ఇక్కడ మహిళలపై జరిగే అఘాయిత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. మజఫర్ నగర్‌లోని 26ఏళ్ల మహిళ పై ఐదురుగు యువకులు సామూహిక అత్యాచారం చేశారు. అత్యాచారం చేసిన నిందితుల్లో ఓ సబ్ ఇన్‌స్పెక్టర్ కొడుకు కూడా ఉన్నాడని ఆదివారం పోలీసులు వెల్లడించారు. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.

స్నేహితురాలి కోసం గిఫ్ట్ కొనేందుకు దుకాణానికి వెళ్లిన మహిళపై మత్తు మందు కలిపిన కూల్ డ్రింక్ ఇచ్చి, షాపు యజమానితో సహా ఐదుగురు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గురించి ఎవరికైనా చెబితే చంపేస్తామని బాధితురాలిని బెదిరించినట్లుగా కొత్వాల్ సబ్ ఇన్‌స్పెక్టర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. నిందితులను విజయ్ కుమార్, అనుజ్ సేథీ, పియాష్ కుమార్, సబ్ ఇన్‌స్పెక్టర్ కుమారుడు కపిల్‌గా గుర్తించామని వెల్లడించారు. ప్రస్తుతానికి ఐదవ నిందితుడు ఎవరన్నది వెల్లడించ లేదు. నిందితుల్లో ముగ్గురిని అదుపులోకి తీసుకున్నామన్నారు. బాధితురాలని వైద్య పరీక్షల నిమిత్తం సమీపంలోని ఆసుపత్రికి తరలించామని తెలిపారు. కేసు నమోదు చేసి, మిగతా వారి కోసం గాలింపు చేపట్టామన్నారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : women gang rape  muzaffarnagar  uttara pradesh  

Other Articles