కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్జైట్లీ లోక్సభలో ప్రవేశపెట్టిన 2015-16 ఆర్థిక సంవత్సర బడ్జెట్ మొత్తం 17. 77 లక్షల కోట్ల రూపాయాలతో రూపొందించారు. తన బడ్జెట్ లో రక్షణ రంగానికి అధిక ప్రాధాన్యత ఇచ్చిన జైట్లీ.. అదే విధంగా విద్యారంగానికి కూడా అగ్రతాంబులాన్నిచ్చారు. బడ్జెట్ లో ప్రణాళికేతర వ్యయం రూ.13,12,200 కోట్లుగా పేర్కోన్న ఆయన ప్రణాళికా వ్యయం రూ.4,65,000 కోట్లుగా పొందుపర్చారు. రక్షణ రంగానికి పెద్దపీట వేసిన ఆయన తన బడ్జెట్ లో రూ.2,46,727 కోట్లు కేటాయించారు. అనంతరం విద్యారంగానికి రూ.68,960 కోట్లను కేటాయించారు. మహిళా శిషు సంక్షేమానికి రూ.10,500 కోట్లు, వైద్యానికి రూ. 3,31,500 కోట్లు కేటాయింపులను ఇచ్చారు. అనంతరం అట్రా మెగా పవర్ కు లక్ష కోట్ల రూపాయల కేటాయింపులను మంజూరు చేశారు
గృహనిర్మాణాలకు రూ.22,407 కోట్లను కేటాయించిన ఆయన మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్లు, షెడ్యూల్డు కుల సంక్షేమ పథకాలకు రూ.30 వేల కోట్లు, జల వనరులకు రూ.4,173 కోట్లు, సోలార్ ఎలక్ట్రికల్ వాహనాలకు రూ.70 కోట్లు, నిర్భయ ఫండ్కు వెయ్యి కోట్లు, ఎంజీఎన్ రేగాకు రూ.5 వేల కోట్లు కేటాయించారు. ఉపాధి హామీ పథకానికి అదనంగా రూ.5 వేల కోట్లు, గ్రామీణ ఉపాధి హామీ పథకానికి రూ.34 వేల కోట్లు, మైక్రో ఫైనాన్స్ కు ముద్ర బ్యాంకు ద్వారా రూ.20 వేల కోట్ల ఫండ్ను కేటాయించారు. దీంతో పాటు స్టార్టప్ కంపెనీల కోసం వెయ్యి కోట్లతో మూల నిధిని కేటాయించారు.
వ్యవసాయ రుణాలు రూ.8.5 కోట్లు ఇవ్వాలనేది లక్ష్యం, నాబార్డుకు 25 వేల కోట్లు, చిన్న తరహా నీటి పారుదల ప్రాజెక్టులకు రూ.5300 కోట్లు, గ్రామీణాభివృద్ధికి రూ.25 వేల కోట్లను కేటాయించారు. అటు స్వయం ఉపాధి కార్యక్రమాల కోసం వెయ్యి కోట్లు, ఐటీ హబ్ ఏర్పాటుకు 150 కోట్లు, శిశు సంరక్షణకు 300 కోట్లు, చైల్డ్ డెవలప్మెంట్ కు 1500 కోట్లు, మౌలిక వసతులకు 70 వేల కోట్ల రూపాయలను కేటాయించారు.
జి.మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more