Nithin tour in essar group boat getting troubles

nithin, essar group, tour, france, alligations, prashanth bhushan, nda minister

nithin tour in essar group boat getting troubles. bjp dept. president and present central minister nithesh gadkeri facing alligation about his previous tour. nithin and his family tavelled in essar group boat from france.

విహార యాత్ర తెచ్చిన వివాదం. గడ్కరీపై విమర్శల వర్షం

Posted: 02/28/2015 08:58 AM IST
Nithin tour in essar group boat getting troubles

తాజాగా కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ రెండేళ్ల క్రితం చేసిన విహార పర్యటన అంశం ఆయన్ని విమర్శల పాలు చేస్తోంది. తమకు అనుకూలంగా రాజకీయ నేతల్ని అధికారులను మలచుకునేందుకు కార్పొరేట్‌ కంపెనీలు పెట్టే ప్రలోభాలకు గడ్కరీ లొంగిపోయారనేది తా జా అభియోగం. దీనిపై సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖ లు కావడం.. అలాగే, మీడియాలో కథనాలు రావడంతో గడ్కరీపై విమర్శలు వెల్లువెత్తాయి. అయితే, ఈ అభి యోగాలు, ఆరోపణలను గడ్కరీ తోసిపుచ్చారు. 2013 జూలైలో గడ్కరీ తన భార్య, కుమారులు, కుమార్తెలతో కలిసి రెండు రోజులు ఎస్సార్‌ గ్రూప్‌ కంపెనీకి చెందిన విహార ఓడలో ఫ్రాన్స్‌లోని నైస్‌ పట్టణం నుంచి ఒక ఓడలో విహారయాత్రకు వెళ్లారు. దీనిపై ఒక ఎన్జీవో పిటిషన్‌ దాఖలు చేశారు.

మంత్రులు, ఉన్నతాధికారులు, రాజకీయ నాయకులు, ఎమ్మెల్యేలు, మీడియా ప్రతినిధులను మచ్చిక చేసుకోవడంలో కొన్ని కార్పోరేట్ సంస్థలు ముందుంటాయి. దీనిపై స్వతంత్ర విచారణకు ఆదేశించాలని ఆ ఎన్జీవో తరఫున వాదిస్తున్న సీనియర్‌ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ డిమాండ్‌ చేశారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్  గడ్కరీ స్పందించారు. అప్పట్లో తాను కుటుంబంతో యాత్ర చేసింది నిజమేనని దానికి అయిన పూర్తి ఖర్చంతా తన కుటుంబ ఖాతా నుంచే చెల్లించామని స్పష్టం చేశారు. ఆ సమయంలో తానే పదవిలో లేనని తెలిపారు.  అయితే గడ్కరీ కొన్ని కార్పోరేట్ వర్గాలకు అనుకూలంగా వ్యవహరిస్తారనే వాదన ముందు నుండి ఉంది. తాను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కార్పోరేట్ సంస్థలకు అనుకూలంగా ప్రభుత్వం నుండి జీవోలు విడుదల చేశారని గతంలో ఆరోపణలు ఉన్నాయి. తాజా ఆరోపణలు ఏ మలుపు తిరుగుతాయో చూడాలి. ప్రధాని మోదీ ఈ వ్యవహారంపై ఎలా స్పందిస్తారో.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : nithin  essar group  tour  france  alligations  prashanth bhushan  nda minister  

Other Articles