Air india plane from delhi suffers tyre burst while landing

Air India plane tyre burst, Air India plane tyre burst while landing, Air India plane narrow escape, Nedumbassery airport, rear tyre of the aircraft burst, Air India flight from Delhi to Nedumbassery, Air India flight on board 170 passengers, business, companies, Air India, air india flight, flight tyre burst,

In a narrow escape for over 170 people on board an Air India flight from Delhi, a rear tyre of the aircraft burst as it landed at the Nedumbassery airport on February 26.

తప్పిన ప్రమాదం.. ప్రయాణికులు క్షేమం.. విమానానికి తప్పవా..?

Posted: 02/26/2015 07:34 PM IST
Air india plane from delhi suffers tyre burst while landing

దేశ రాజధాని ఢిల్లీ నుంచి బయల్దేరిన ఎయిరిండియా విమానానికి తృటిలో పెద్ద ప్రమాదం తప్పింది. అందులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు ఎయిర్ పోర్టు వచ్చేసింది కదా అని నడుముకు వున్న బెల్టులు తీసేసి చేతి లగేజిని తీసుకునేందుక ప్రయత్నిస్తున్నారు. అంతలో ఉన్నట్టుండి ఒక పెద్ద శబ్దం.. ప్రయాణికులందరూ హాహాకారాలు చేస్తూ వారి సీట్లలో వారు కూర్చున్నారు. అయితే కిటీకీల పక్కనున్న వారు మాత్రం అయ్యే విమానం రన్ వే పై నుంచి కాకుండా ఎక్కడికో వెళ్తోందంటూ అరుపులు పెట్టారు.

ఇంతలో బ్రేకులు పడ్డాయి. అంతే ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. తాము సజీవంగా వున్నందుకు ముందుగా దేవుడికి ధన్యవాదాలు తెలపుకున్నారు. ఆ తరువాత జరిగిన విషయం తెలుసుకుని తృటిలో ప్రాణాపాయం తప్పిందంటూ వారికి వారే సముదాయించుకున్నారు.. ఢిల్లీ నుంచి కేరళలోని కొచ్చికి బయల్దేరిన ఎయిరిండియా విమానం సరిగ్గా ల్యాండ్ అవుతోందనగా.. దాని టైరు పేలిపోయింది. అందులో 161 మంది ప్రయాణికులు, 12 మంది సిబ్బంది ఉన్నారు. అయితే వాళ్లంతా సురక్షితంగా కిందకు దిగగలిగారు.

ఉదయం 9.10 గంటలకు విమానం దిగే సమయానికి అక్కడంతా మంచు దట్టంగా అలముకుని ఉంది. వెనకవైపు ఉన్న టైరు పేలిపోయింది. అయినా పైలట్ విమానాన్ని సురక్షితంగా కిందకు దించగలిగారు. బెంగళూరు నుంచి సాంకేతిక నిపుణులు వచ్చి విమానాన్ని పరిశీలించారు. ఈ కారణంగా ఉదయం 10.20 గంటలకు 138 మంది ప్రయాణికులతో షార్జా వెళ్లాల్సిన ఆ విమానం బాగా ఆలస్యంగా బయల్దేరాల్సి వచ్చింది. అయితే విమానం బయలుదేరే ముందు అంతా సవ్యంగా వుందా లేదా అని పరిశీలించాల్సిన సాంకేతిక బృందం పూర్తైన తరువాత కూడా టైరు ఎలా బస్ట్ అయ్యిందని ఎయిర్ ఇండియా అధికారులు విచారణ చేపట్టారు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Air India flight  tyre burst  Nedumbassery airport  

Other Articles