Tammineni attcks on ap govt

tammineni, sitharam, tdp, ysrcp, ap govt, govt gos, pentions, constitution

tammineni setharam attcks on tdp and ap govt. the ap govt release new gos to benefit the tdp leaders. go nos 135, 101, 535 are opposing the constitution.

టిడిపి వారు పందికొక్కులు అంటున్న తమ్మినేని

Posted: 02/26/2015 02:03 PM IST
Tammineni attcks on ap govt

తెలుగు దేశం పార్టీ మీద మాటల యుద్దానికి అందరు సిద్దంగా ఉంటారన్నట్లుగా వ్యవహరిస్తున్నారు మన నాయకులు. అయితే టిడిపి పై దాడి చేసే వారిలో గతంలో టిడిపిలో ఉండి, తర్వాత పార్టీ మార్చిన వారు కాస్త ఘాటుగా స్పందిస్తుంటారు. టిడిపి నేత తలసాని శ్రీనివాస్ యాదవ్ లాంటి వారైతే చంద్రబాబును మరీ తీసిపారేసినట్లు మాట్లాడుతుంటారు. అయితే తాజాగా మాజీ టిడిపి నేత, ప్రస్తుత వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ నేత తమ్మినేని సీతారామ్ వంతు వచ్చినట్లుంది. అందుకే తెలుగుదేశం వారిని ఏకంగా పచ్చచొక్కాలవారిని పందికొక్కులంటున్నారు.

ఎపి ప్రభుత్వం జారీ చేసిన కొన్ని జివోలు అచ్చంగా టిడిపి వారికి లాభం చేసేలా ఉన్నాయని ఆయన ఆరోపించారు. చంద్ర బాబు సర్కారు జారీ చేసిన 135, 101, 535 జీవోలు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమన్నారు. పింఛన్లతో సహా ఏ సంక్షేమ పథకం కావాలన్నా ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీల ద్వారానే జరగాలని నిర్దేశించడం దారుణమని ఆయన ధ్వజెమెత్తారు. వీటిలో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులకు స్థానం కల్పించామని చెప్పారని అయితే ఏ గ్రామ కమిటీలో చూసినా టీడీపీకి చెందిన వారే నియమితులయ్యారని, అందువల్ల కింది నుంచి పైస్థాయి వరకు పాలనంతా రాజకీయమయంగా మారిందని ఆయన ధ్వజమెత్తారు. నేరస్తులు, రౌడీలే ఈ కమిటీల్లో ఉన్నారన్నారు. గత ఎన్నికల్లో వైఎస్సార్ సీపీకి మద్దతు పలికిన వారికి పింఛన్లు రద్దు చేశారని ఆయన ఆరోపించారు. మొత్తానికి టిడిపిపై, చంద్రబాబుపై విమర్శల వర్షం కురిపించారు తమ్మినేని.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : tammineni  sitharam  tdp  ysrcp  ap govt  govt gos  pentions  constitution  

Other Articles