తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు చంద్రలు ఉన్నారని అందరికి తెలుసు. ఏపి సిఎం చంద్రబాబు, తెలంగాణ సిఎం చంద్రశేఖర్ రావ్. ఇలా వీరిద్దరే కాదు నేను కూడా చంద్రున్నే, నానుండి వెన్నెలే వస్తుందని అంటున్నారు మరోనేత. ఇప్పటికే ఇద్దరు చంద్రులు ఉన్నారు మరి ఇంకో కొత్త చంద్రుడు ఎక్కడి నుండి వచ్చాడు, ఇంతకీ ఎవరా చంద్రుడు అనుకుంటున్నారా అయితే ఈ స్టోరో చదవాల్సిందే.
కాంగ్రెస్ నేత, తెలంగాణ కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి కొంత కాలంగా ప్రభుత్వానికి సానుకూలంగా వ్యవహరిస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ తరఫున శాసనసభలో మెతక వైఖరిని అవలంబిస్తున్నారని కాంగ్రెస్ అధిష్ఠానానికి కొందరు స్వంత పార్టీ నేతలే ఫిర్యాదు చేశారు. అయితే తన వైఖరి ఇలానే ఉంటుందని తాను చంద్రుడిలాంటి వాడినని, తన నుండి వెన్నెల మాత్రమే వస్తుందని, వేడి రాదని మీడియా ఎదుట వెల్లడించారు. మల్లెపువ్వు నుంచి సువాసన గుబాళించినట్టుగా మరోపవ్వు నుంచి రాదని, మరోపవ్వు వాసన ఇవ్వడం మల్లెపూవు వల్ల కూడా కాదన్నారు. తన పనితీరు మార్చుకోవాలని చెబుతున్నవారు, తనలా పనిచేయలేరని జానారెడ్డి వివరించారు.
తమ పార్టీలో వేడి పుట్టించే రంగయ్యలు ఉన్నారు. మీడియా వారు ఏది అడిగితే అది చెప్పడం ఆ రంగయ్యలకు సాధ్యం. నా గురించి ఎవరో రంగయ్య ఏదో అన్నాడని నాకు చెప్పడం, దానిపై నేనేదో మాట్లాడితే ఆ రంగయ్యలకు చెప్పడం, దానికి రంగయ్య ఏదో అనడం ఇవన్నీ అవసరమా? ఇవన్నీ మీకు వార్తలు కావొచ్చు, కానీ అవన్నీ నాకు సాధ్యం కాదు. లేని వేడిని పుట్టించాలనుకుంటున్న మా పార్టీలో రంగయ్యను అడగండి అని పరోక్షంగా టీపీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఉద్దేశించి జానారెడ్డి వ్యాఖ్యానించారు. మొత్తానికి కాంగ్రెస్ సీఎల్పీ నేత జానారెడ్డి కాస్త చంద్రుడినంటూ స్వతహాగా ప్రకటించుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఇద్దరు చం్ద్రులు ఉన్నా వేడి ఉందే కానీ వెన్నెల్ లేదని ఇప్పనటికే చాలా మంది అనుకుంటున్నారు. అయితే తాజా చంద్రున్ని ప్రజలు ఎలా స్వాగతిస్తారో చూడాలి.
- అభినవచారి
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more