Mild earthquake in prakasham and guntur

Mild earthquake, prakasam district, guntur district,

in prakasham and guntur dist mild earthquake in the early mornig: people afraid of earthquak, ran from their houses into the caridors.

గుంటూరు, ప్రకాశంలలో స్వల్ప భూకంపం..అప్రమత్తమైన అధికారులు

Posted: 02/25/2015 09:17 AM IST
Mild earthquake in prakasham and guntur

గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో ఈ తెల్లవారుజామున భూమి స్వల్పంగా కంపించింది. ప్రకాశం జిల్లా . ఒంగోలు, అద్దంకి, కొరిశపాడు తదితర ప్రాంతాల్లో స్వల్పంగా భూమి కంపించడంతో  ప్రజలు కొంత ఆందోళన చెందారు. భయంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. కొరిశపాడు మండలంలోని పలు గ్రామాల్లో ఉదయం 6.10 గంటలకు ప్రారంభమైన భూ ప్రకంపనలు కొన్ని క్షణాల పాటు కొనసాగాయి. మరోవైపు గుంటూరు జిల్లాలోనూ భూమి నాలుగు క్షణాలపాటు కంపించింది. చిలకలూరి పేట మండలం మద్ధిరాల, రాజాపేట, ఎడవల్లి, మురికిపూడి గ్రామాల్లో భూప్రకంపనలు వచ్చాయి. మూడు నెలల క్రితం కూడా ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. అయితే రిక్టర్ స్కేల్ పై 4.0 తీవ్రత నమోదైంది.

తాజాగా జరిగిన భూప్రకంపనలపై అధికారులు అప్రమత్తమయ్యారు. భవిష్యత్తులో వచ్చూ భూకంపానికి ఇధి ముందు హెచ్చరికా అన్న కోణంలో పరిశోధించాలని నిపుణులు అంటున్నారు. భూప్రకంపనల కేంద్రం చిలకలూరిపేటకు 32 కిలోమీటర్ల దూరంలో నమోదైందని అధికారులు వెల్లడించారు. ప్రకాశంలో సంభవించిన భూప్రకంపనలపై క్షేత్రస్థాయి పర్యటన చేసి నివేదిక సమర్పించాలని జిల్లా ఇంఛార్జ్ కలెక్టర్ హరి జవహర్ లాల్ అధికారులకు ఆదేశాలిచ్చారు. ఈ భూప్రకంపనలపై ఎన్జీఆరై అధికారులు కూడా దృష్టిసారించారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mild earthquake  prakasam district  guntur district  

Other Articles