ఎప్పుడెప్పుడా అంటూ జంటనగరాల ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న మెట్రో రైలు తెలుగు నూతన సంవత్సరాది ఉగాది నుంచి కూత పెట్టనుంది. ఈ మేరకు మెట్రో రైలు పనులపై సమీక్షించిన ప్రభుత్వం మార్చి 21వ తేదీని ఖరారు చేసింది. ఇక మరో నెల రోజుల లోపు మెట్రో రైలు కూత పెట్టనుంది. తెలుగు సంవత్సరాది ఉగాది పర్వదినం రోజున రైలు అధికారికంగా పట్టాలు ఎక్కునుంది. అయితే ఇది మొత్తంగా కాదండీ కేవలం మొదటి దశ మెట్రో రైలు మాత్రమే ఆ రోజు నుంచి అందుబాటులోకి వస్తుంది. హైదరాబాదులోని నాగోలు నుంచి మెట్టుగుడా వరకు ఈ రైలు నడుస్తుంది. ప్రయాణికులు ఉగాది నుంచి దాన్ని వాడుకోవచ్చు. ప్రస్తుతం నాగోల్ - మెట్టుగూడ మార్గంలో మెట్రో రైళ్లను ప్రయోగాత్మకంగా టెస్ట్ రన్ ఇప్పటికే అధికారులు పూర్తి చేశారు.
ఆగస్టు నుండి పలు టైస్ట్ డ్రైవ్‌లు చేస్తున్నారు. ఏటీవోను ఇటీవల తొలిసారి పరీక్షించారు. కమ్యూనికేషన్ ఆధారిత ట్రెయిన్ నియంత్రణ వ్యవస్థ (సీబీటీసీ)ను భారతదేశంలోనే మొట్టమొదటి సారిగా మెట్రోలో అమలు చేయనున్నారు. ప్రపంచంలో మొదటిసారిగా ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫ్రాన్స్‌కు చెందిన థాలేస్ కంపెనీ హైదరాబాద్ మెట్రోకు అందిస్తోంది. ఈ రేడియో సమాచార ఆధారిత వ్యవస్థ రైళ్ల గమనాన్ని నిరంతరం ప్రసారం చేస్తుంది. ఒక విధంగా చెప్పాలంటే రైళ్లు ఒకదానితో ఒక్కటి రేడియో ద్వారా మాట్లాడుకుంటాయన్నమాట.
మెట్రో రైలులోని సాంకేతిక వ్యవస్థ మొత్తం ఆరు జోన్లుగా ఉంటుంది. జోన్ కంట్రోలర్ ద్వారా ప్రతి రైలు ఉనికిని, గమనాన్ని, వేగాన్ని మిగతా రైళ్లకు నిరంతరం తెలియజేస్తుంది. ఆ మేరకు రైళ్లు తమ వేగాన్ని నియంత్రించుకుంటూ అవసరమైనప్పుడు వాటంతట అవే బ్రేకులు వేసుకుంటాయి. ఆటోమేటిక్ ట్రైన్ సూపర్ విజన్, ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటేక్షన్, జోన్ కంట్రోలర్, డేటా కమ్యూనికేషన్ తదితర అనేక ఉపవ్యవస్థలు, మెట్రో రైళ్లు సురక్షితంగా రాకపోకలు సాగించేందుకు, ఢీకొట్టకుండా ఉండేలా పర్యవేక్షిస్తాయి. మానవ తప్పిదాల కలిగే ప్రమాదాల నుండీ, హెచ్చరిక సంకేతాలను దాటి రైలు ముందుకు వెళ్లకుండా ఈ సాంకేతిక పరిజ్ఞానం కాపాడుతుంది. ఆటోమెటిక్ ట్రెయిన్ ఆపరేషన్ వ్యవస్థకు సంబంధించి మెయిన్ కంట్రోల్‌ను ఉప్పల్ డిపోలో ఏర్పాటు చేస్తున్నారు. దీని ద్వారా మొత్తం 72 కిలోమీటర్ల పొడవునా హైదరాబాద్ మెట్రోరైలు వ్యవస్థ పనిచేస్తుంది.
జి. మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more