Maldives president mohamed nasheed was forcibly dragged

maldives, president, police, nasheed, terrorism case, court, pm modi

Police dragged Maldives' former president Mohamed Nasheed into a court, which ordered his detention while he is tried over his decision to arrest a top judge three years ago. The police ignored his plea to be allowed to walk in himself, and denied him medical attention though the court had ordered “necessary treatment

మాల్దీవుల మాజీ అధ్యక్షుడిపై పోలీసుల అరాచకం

Posted: 02/24/2015 04:47 PM IST
Maldives president mohamed nasheed was forcibly dragged

పోలీసులు ఎలా వ్యవహరిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన, మన అనే భేదాభిప్రాయాలు అసలుండదని మామూలుగా అనుకుంటారు. ఇదే విషయాలను నిజం చేశారు మాల్దీవ్స్ కు చెందిన పోలీసులు. మాల్దీవుల మాజీ అధ్యక్షుడు మొహమ్మద్ నషీద్ క్రిమినల్ కోర్టు ఎదుట విలేకరులతో మాట్లాడే సమయంలో పోలీసులు కర్కశంగా ప్రవర్తించారు. జర్నలిస్టులతో మాట్లాడకుండా  అతనిని ఈడ్చుకు పోయారు. 2012లో అతను అధికారంలో ఉన్న సమయంలో యాంటీ టెర్రరిజంలాను చట్టవిరుద్ధంగా ఉపయోగించారని అతని పైన ఆరోపణలు ఉన్నాయి. ఈ కేసుకు సంబంధించి లాయర్లను నియమించుకోవాలని కోర్టు అతనికి మూడు రోజుల సమయం ఇచ్చింది. ఈ నేపథ్యంలో సోమవారం కోర్టుకు తీసుకు వచ్చిన అతను జర్నలిస్టులతో మాట్లాడుతుండగా.. పోలీసులు అడ్డుకొని ఈడ్చుకెళ్లారు. అతనికి కోర్టు బెయిల్ నిరాకరించింది.

ఈ ఘటనలో అతనికి చేతి ఎముక విరిగింది. మరోవైపు, అతనిని వ్యక్తిగత లాయరును కలవనీయలేదు. విచారణ పూర్తయ్యే వరకు పోలీసు కస్టడీలోనే ఉంచాలని ఆదేశించారు. ఈ మొత్తం ఘటన పైన అంతర్జాతీయ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. చొక్కా పట్టి లాక్కొచ్చిన పోలీసులు.. తనకు గాయాలు అయితే కనీసం వైద్యుడి వద్దకు కూడా తీసుకు పోలేదని నషీద్ కోర్టులో జడ్జి ముందు చెప్పారు. తన చేయి విరిగిందని చెప్పాడు. అయితే, జడ్జి అతని విజ్ఞప్తిని వినిపించుకోకుండా ప్రొసీడింగ్స్ సాగించారని సమాచారం. అతను దేశం విడిచి పారిపోతాడని భావించి పోలీసులు ముందస్తుగా అరెస్టు చేసినట్లుగా తెలుస్తోంది. మాజీ నేత నషీద్ అరెస్టును మాల్దీవుల ప్రభుత్వం సమర్థించింది. కాగా, మొహమ్మద్ నషీద్‌ను పోలీసులు ఈడ్చుకెళ్లడం పైన భారత్ స్పందించింది. నషీద్ పైన పోలీసుల దాడి దురదృష్టకరమని, నిష్పక్షపాత విచారణ జరగాలని ప్రధాని మోడీ అన్నారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : maldives  president  police  nasheed  terrorism case  court  pm modi  

Other Articles