Argigold collected 6380cr from costomers

agrigold, abhayagold, ap, cid, collections, agents, costomers, finance, chits,property, ventures

argigold collected 6380cr from costomers: agrigold collect 6380 cr from 32 lakh peole. ap govt order to interagate the agrigold and abhayagold issue last one month.

6380 కోట్ల మోసం చేసిన అగ్రిగోల్డ్..సిఐడి విచారణలో వెల్లడి

Posted: 02/24/2015 10:15 AM IST
Argigold collected 6380cr from costomers

తెలుగు రాష్ట్రాల్లో లక్ష మంది కస్టమర్ల దగ్గరి నుండి డబ్బులు వసూలు చేసి, తిరిగి చెల్లించని అగ్రిగోల్డ్ సంస్థపై సిఐడి విచారణ వేగవంతం చేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అగ్రిగోల్డ్ వ్యవహారంపై సిఐడి చేత దర్యాప్తు చేయిస్తోంది. కాగా రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ అగ్రిగోల్డ్ పై వేల ఫిర్యాదులు రావడంతో ఏపి దర్యాప్తకు ఆదేశించింది. కస్టమర్ల దగ్గరి నుండి కోట్ల రూపాయలు వసూలు చేసి, ఆస్తులను కూడబెట్టింది అగ్రిగొల్డ్ సంస్థ. కానీ కంపెనీ పేరు మీదున్న ఆస్తులు బ్యాంక్ తనఖాలో ఉండడం విశేషం. దాంతో ఏపి ప్రభుత్వం అగ్రిగోల్డ్ సంస్థ, సంస్థకు చెందిన డైరెక్టర్లు, బోర్డు మెంబర్ల ఆస్తులను అటాచ్ చేసింది.

అగ్రిగోల్డ్ సంస్థ చేతిలో మోసపోయిన వారి సంఖ్య 32 లక్షలు అని తాజాగా సిఐడి విచారణలో తేలింది. వీరి నుండి 6380 కోట్ల రూపాయలను అగ్రిగోల్డ్ వసూలు చేసినట్లు తెలిసింది. అదేవిధంగా అభయగోల్డ్ సంస్థ కూడా ప్రజల నుండి 130 కోట్లు వసూలు చేశారని అధికారులు తెలిపారు. మొత్తానికి అగ్రిగోల్డ్ భారీ మోసానికి పాల్పడిందని సిఐడి విచారణలో ఓ అభిప్రాయానికి వచ్చింది.అయితే ఇప్పుడు అగ్రిగోల్డ్ బాధితులకు డబ్బులు ఎలా వసూలు చేస్తారు, వారికి ఎలా చెల్లిస్తారన్నది ప్రశ్న. అయినా ప్రభుత్వం ప్రైవేట్ చిట్ ఫండ్స్, ఫైనాన్స్ సంస్థలను నమ్మవద్దని ఎన్నిసార్లు హెచ్చరికలు జారీ చేసినా, ప్రజల్లో మాత్రం ఎలాంటి మార్పులు రావడం లేదు. ఏజెంట్లు చెబుతున్న మాటలకు మోసపోతే పరిస్థితి ఇలానే ఉంటుంది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : agrigold  abhayagold  ap  cid  collections  agents  costomers  

Other Articles