Kejriwal rahul can join protest but not share stage hazare said

kejriwal, anna, rahul, land pooling, anna hazare, pm modi, social activist

Social activist Anna Hazare, who will participate in a two-day protest against the land ordinance at the Jantar Mantar beginning Monday, has said that Congress vice-president Rahul Gandhi and Delhi chief minister Arvind Kejriwal can join the movement.

కేజ్రీ, రాహుల్ లు ఉద్యమంలో పాల్గొనవచ్చు: హజారే

Posted: 02/23/2015 10:39 AM IST
Kejriwal rahul can join protest but not share stage hazare said

అన్నా హజారే చేపడుతున్న భూసేకరణ బిల్లు వ్యతిరేక ఉద్యమానికి కేజ్రీవాల్, రాహుల్ గాంధీలు రావచ్చని అన్నా పిలుపునిచ్చారు.  కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు రాహుల్ గాంధీ లాండ్ పూలింగ్ చట్టాలను వ్యతిరేకంగా నిరసనలను చేపట్టింది. అయితే ఈ నిరసనల్లో సాంఘిక ఉద్యమ కారుడు అన్నా హజారే కూడా పలుపంచుకోవాలని కాంగ్రెస్ ఆహ్వానం పంపింది. కానీ అన్నా దానిపై ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కాగా తాజాగా అన్నా హజారే మీడియాతో మాట్లాడుతూ రాహుల్, కేజ్రీవాల్ లు ఇద్దరు తనతో కలిసి ఉద్యమంలో పాలుపంచుకోవచ్చని అన్నారు. అయితే వారు అన్నా హజారేతో కలిసి వేదికను పంచుకోవడం కాకుండా, మామూలు వ్యక్తుల్లా ఉద్యమంలో పాల్గొనాలని అన్నారు. లోక్ పాల్ బిల్లు ఉద్యమం సమయంలో అన్నా హజారే వెంట నడిచిని కేజ్రీవాల్ ప్రస్తుతం ఢిల్లీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అయినా అన్నా ఉద్యమానికి తమ మద్దతు ఉంటుందని ఆప్ ప్రకటించింది.

మరోవైపు అన్నా హజారే ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తొ సమావేశం కానున్నారు. ల్యాండ్ పూలింగ్ రూల్స్ పై చేస్తున్న ఉద్యమంపై వారు చర్చించనున్నట్లు సమాచారం. అయితే అన్నా హజారే హర్యానా, పంజాబ్, రాజస్థాన్, ఉత్తర్ ప్రదేశ్, బీహార్ నుండి దాదాపు 20 వేల మంది రైతులు ఉద్యమంలో పాలుపంచుకుంటారని అన్నా ప్రకటించారు. మేధపాట్కర్, గోవిందాచార్య, రాజేంద్రసింగ్లతో పాటు దేశవ్యాప్తంగా 80 స్వచ్ఛంద సంస్థలకు చెందిన వారు ఈ ఉద్యమంలో పాల్గొంటారని అన్నా హజారే తెలిపారు.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : anna hazare  kejriwal  rahul  pooling  

Other Articles