కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారుపై భారతీయ రిజర్వు బ్యాంకు గవర్నర్ రుఘురామ్ రాజన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. దేశంలోని దృడమైన ప్రభుత్వాలు కూడా సరైన మార్గంలో పయనించడం లేదని ఆయన అవేదన వ్యక్తం చేశారు. దృడమైన ప్రభుత్వాలు కూడా సరైన మార్గాల్లో పయనిస్తాయన్న విశ్వాసం తనకు లేదని అభిప్రాయపడ్డారు. గోవాలో నిన్న జరిగిన ఓ సమావేశంలో పాల్గోన్న ఆయన దేశంలో న్యాయవ్యవస్థ, ప్రతిపక్షం, మీడియా, ఎన్జీవో సంస్థల ఎంత దృడంగా వున్నా.. ప్రభుత్వ నియంత్రణ సామార్యాథలు కూడా అంతే పటిష్టంగా వుండటం అవసరమని అభిప్రాయపడ్డారు.
ఆర్బీఐకి వున్న స్వీయ పరిమితులపై ఆర్థిక రంగ శాసన సంస్కరణలు కమిషన్ (FSLRC) సిఫార్సులను పరిగణలోకి తీసుకుని అన్ని ఆర్థిక రంగశాఖలపై అత్యున్నత నియంత్రకాలను ఏర్పాటు చేయడంపై ఆయన మండిపడ్డారు. ఈ తరహా వ్యవస్థలతో బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని తిరిగి చెల్లించడంలో విఫలమైన డీఫాల్టర్స్.. ఇకపై అప్పీలు చేసుకునే అవకాశం కల్పించినట్లేనన్నారు. లైనెన్స్ పర్మిట్ రాజ్ ఇకపై అప్పీలు రాజ్ గా మారనుందని వ్యంగ వ్యాఖ్యలు చేశారు.
బ్యాంకింగ్ వ్యవస్థలో న్యాయవ్యవస్థ నుండి అధిక జోక్యం కూడా వాణిజ్య బ్యాంకులు రుణ బకాయిల వసూళ్లకు పెద్ద అవరోధంలా పరిణమించిదని నిరూపితమైందన్నారు. ప్రభుత్వం లేదా నియంత్రక వ్యవస్థ కేసును తయారు చేయడంలో ప్రవేటు పార్టీలకన్నా తక్కువ ప్రభావాన్ని చూపితే.. తప్పును సరిద్దడానికి బదులు అప్పీలుకు వెళ్లిన పార్టీలు వాటికున్న వనరులను వినియోగించుకుని సానుకూలంగా న్యాయం పోందగలుగుతున్నారన్నారు. పునర్విచారణ పేరుతో అడ్డుంకులు ఏర్పర్చుతున్నారన్నారు. తమకు చెక్లు సంతులనం అవసరమని, అయితే ఈ చెక్లు సంతులనంతో వుండాలన్నారు. తమ లైసెన్సు పర్మిట్ రాజ్ విధానం నుంచి తప్పించుకోలేని వాళ్లు కూడా న్యాయస్థానాన్ని ఆశ్రయించి పునర్విచారణ పేరుతో కాలన్ని వెళ్లబుచ్చుతున్నారని పేర్కోన్నారు.
బ్యాకింగ్ వ్యవస్థలలో న్యాయవ్యవస్థల విపరీత జోక్యం కూడా నష్టాలను తెచ్చిపెడుతుందన్నారు. ఇందుకు ఆయన విజయ్ మాల్యా ఘటనను ఉదాహరణగా పేర్కోన్నారు. కోల్ కత్తా హైకోర్టు విజయ్ మాల్యాను విల్ ఫుల్ డీపాల్టర్ గా పేర్కోన్నాలని భారతీయ యూనైటెడ్ బ్యాంక్ ను అదేశిస్తూ తీర్పును వెలువరించిందన్నారు. దీంతో విజయ్ మాల్యా వద్ద డబ్బులు వున్నప్పటికీ బ్యాంకులకు చెల్లించే అవసరం లేకుండా పోతోందని ఆయన అందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి ఘటనలు నిర్థేశిత అవసరాలకు కాకుండా నిధుల మళ్లింపుతో వస్తాయని ఇది కూడా ఆర్థిక నేరమని ఆయన చెప్పారు. విల్ ఫుల్ డీపాల్టర్ గా నమోదైన వ్యక్తి ఇతర వాణిజ్యాలను చేయకూడదని, ఇతర బ్యాంకుల్లో ఢిఫార్టర్ కానీ, సంస్థ డైరెక్టర్ల లావాదేవీలను చేయకూడదన్నారు. 7వేల కోట్ల రూపాయల వాణిజ్యాలను నడుపుతున్న విజయ్ మాల్యా అర్థిక నేరానికి పాల్పడినా.. అతనికి సానుకూలంగానే న్యాయస్థానం తీర్పును వెలువరించిందని రఘురామ్ రాజన్ అవేదన వ్యక్తం చేశారు.
జి మనోహర్
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more