Fire at dubais the torch skyscraper no casualties reported

fire at dubais the torch skyscraper, Hundreds of people in Dubai were evacuated, Dubai, world's tallest residential buildings in dubai, fire in world's tallest residential building, tallest building, arson, fire, United Arab Emirates (UAE), emirate's Marina district, no casualties in torch fire accident,

Hundreds of people in Dubai were evacuated from one of the world's tallest residential buildings on Saturday when fire swept through the Torch, a 79-story skyscraper.

దుబాయ్ లోని టార్చ్ ఆకాశహర్మ్యాంలో అగ్నిప్రమాదం

Posted: 02/21/2015 10:49 AM IST
Fire at dubais the torch skyscraper no casualties reported

దుబాయ్లో అత్యంత ఎత్తైన నివాసాల సముదాంలో ఇవాళ భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రపంచంలోనే ఎత్తైన భవన ఆకాశహర్మ్యంలో ఒకటైన 'టార్చ్' టవర్లో ఈరోజు తెల్లవారుజామున  ఈ సంఘటన చోటుచేసుకుంది. భవన సముదాయంలోని 59వ అంతస్తులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. ప్రమాదం జరిగినప్పుడు వేలాదిమంది ఉండగా, అప్రమత్తమైన పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని వారిని వందలాది కుటుంబాలను ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగంగా సురక్షితంగా బయటకు తరలించినట్లు సమాచారం. పెద్ద ఎత్తున ఎగసిపడుతున్న మంటలను అగ్నిమాపక సిబ్బంది అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు.  

బిల్డింగ్ మధ్య భాగంలో అగ్నిప్రమాదం జరగటంతో భవన సముదాయంలో చిక్కుకున్నవారు కొంతమంది మెట్ల ద్వారా కిందకు రాగా, మరికొందరు బిల్డింగ్ పైకి చేరుకున్నారు. చిక్కుకున్నవారిని సురక్షితంగా బయటకు తరలించేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది యత్నిస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు చెబుతున్నారు. ఘటనా స్థలానికి చేరకున్న సుమారు 12 పైగా అగ్రిమాపక దళాలు మంటలను అదుపుచేసేందుకు యత్నిస్తున్నాయని చెప్పారు. అర్థరాత్రి రెండు గంటల సమయంలో అకస్మాత్తుగా మంటలు వ్యాపించడంతో అగ్నిప్రమాదం సంభవించిందని స్థానికులు చెబుతున్నారు.

కాగా అగ్నిప్రమాదానికి గల కారణాలను వివరించేందుకు సంబంధిత అధికారులు నిరాకరించారు. అయితే ప్రమదాంలో ఎలాంటి ప్రాణనష్టం కానీ, క్షతగాత్రులు కానీ లేరని అక్కడి వైద్యాధికారులు చెబుతున్నారు. అగ్నిప్రమాదం నేపథ్యంలో ఈ బహుళ అంతస్థు భవనానికి పక్కనే వున్న మరో రెండు భవనాలలోని కుటుంబాలను కూడా అధికారులు ముందస్తు జాగ్రత్త చర్యగా ఖాళీ చేయించారని సమాచారం. మరోవైపు బయటకు వచ్చేందుకు అందరూ ఒక్కసారిగా మెట్లమార్గాన్ని ఆశ్రయించటంతో తొక్కిసలాట జరగి పలువురు గాయపడినట్లు తెలుస్తోంది.  60వ అంతస్తు పూర్తిగా అగ్నికి ఆహుతి అయ్యింది.  కోట్లలో ఆస్తినష్టం జరిగినట్లు అధికారుల అంచనా. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : fire  dubai  torch  skyscraper  

Other Articles