Jp comment on two states cms

jp, cm babu, kcr, jayaprakesh, loksatta,

jp comment on two states cms : loksatha party leader jayaprakash narayana said that cm babu, kcr not focing on development of their states. youth have to key role to the country.

ఇద్దరు చంద్రులు చుక్కలు చూపుతున్నారు: జేపి

Posted: 02/21/2015 09:18 AM IST
Jp comment on two states cms

రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన ఇద్దరు చంద్రులు ప్రజలకు చుక్కలు చూపుతున్నారని లోక్ సత్తా అధినేత జయప్రకాశ్ నారాయణ మండిపడ్డారు. రాష్ట్రాల అభివృద్ది, విద్య ప్రమాణాల పెంపు విషయాలను వారు విడిచిపెట్టారని ఆరోపించారు. యువత రాజకీయాల్లో కీలక శక్తిగా ఎదిగినపుడు దేశం వేగంగా అభివృద్ది వైపు పరుగులు తీస్తుందని ఆయన తెలిపారు. హైదరాబాద్ లొ జరిగిన లోక్ సత్తా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పాల్గొన్న ఆయన, యువతకు పలు సూచనలు చేశారు. వారసత్వ రాజకీయాలను ముందు నుండి వ్యతిరేకిస్తున్నామని వెల్లడించారు. వ్యక్తి కన్నా పార్టీ ముఖ్యం అన్న నినాదం మరిచి, పార్టీ కన్నా దేశం ముఖ్యం అనే విధానికి ప్రాధాన్యత రావాలని కోరారు.
-అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : jp  cm babu  kcr  jayaprakesh  loksatta  

Other Articles