Youtube kids service from google

youtube, google, new app, kids, netusers

Google's popular online video service YouTube is all set to launch a new app designed specifically for kids on February 23, 2015. The app, called YouTube Kids will run on smartphones and tablets and will most likely be free to use.

పిల్లల కోసం యూట్యూబ్ కిడ్స్

Posted: 02/20/2015 05:09 PM IST
Youtube kids service from google

యూ ట్యూబ్..ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిన వీడియో సర్వీస్. గూగుల్ నిర్వహిస్తున్న ఈ సర్వీస్ ను ప్రపంచ వ్యాప్తంగా కొన్ని కోట్ల మంది వాడుకుంటున్నారు. నెట్ లో ఏ వీడియో చూడాలనుకున్నా..దాన్ని యూట్యూబ్ ద్వారానే చూడటం చాలా మందికి అలవాటు. అయితే యూట్యూబ్ లో అన్ని రకాల వీడియోలు  ఉంటాయి. కొన్ని చిన్న పిల్లలు చూడడానికి వీలులేనివి కూడా ఉంటాయి. కానీ యుట్యూబ్ కు అలవాటు పడ్డ వారు మాత్రం దీని నుండి దూరంగా ఉండలేక, పిల్లలకు నెట్ ను దూరంగా ఉంచుతున్నారు.

అయితే తాజాగా గూగుల్ పిల్లల కోసం యూట్యూబ్ కిడ్స్ పేరుతో కొత్త సర్వీస్ ను ప్రారంభిస్తోంది. ఈ నెల 23 న దీన్ని లాంఛనంగా విడుదల చెయ్యనున్నారు. 13 సంవత్సరాల లోపు పిల్లలందరికి ఈ కొత్త సర్వీస్ ఎంతో ఉపయోగం. ఈ కొత్త సర్వీస్ చిన్న పిల్లలకు కావాల్సిన కార్టూన్, ఇన్ఫర్మేషన్ ను కలిగి ఉంటుంది. ఇది అన్ని రకాల స్మార్ట్ ఫోన్స్, ట్యాబ్స్ లో వాడుకోవచ్చు అది కూడా ఉచితంగా. పిల్లలు చక్కగా తమకు నచ్చిన వీడియోలను ఈ యూట్యూబ్ కిడ్స్ లో నిరభ్యంతరంగా చూడవచ్చు. ఈ సర్వీస్ వంద శాతం సేఫ్ అని గూగుల్ ప్రకటించింది.
- అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : youtube  google  new app  kids  netusers  

Other Articles