Bjp had no role in the issue says shahnawaz hussain

BJP had no role in the issue, bjp spokesperson shanawaz hussian, Our MLAs received death threats, death threat to our mlas, bihar trust vote, nitish to show his majority, Manjhi steps down as bihar cm, secret behind manjhi governer meet, manjhi resigns as bihar chief minister, nitish kumar to return as bihar cm, Manjhi meets governer kn tripathi, why manjhi steps down as bihar cm, bihar chief minister jitin ram manjhi, Nitish Kumar, Jitan Ram Manjhi, Bihar CM, bihar assembly polls, Narendra Modi, Political Play, Sharad Yadav, janata dal united president

BJP stood for justice, we stood for a person from Maha Dalit Samaj, we have fulfilled our responsibility.says bjp spokesperson shanawaz hussian

రాముడిపై క్లారిటీ కోరవడిన బీజేపి

Posted: 02/20/2015 03:19 PM IST
Bjp had no role in the issue says shahnawaz hussain

రామజన్మభూమిలో రమ్య రామ మందిరం అన్న నినాదంలో గతంలో అధికాంలోకి వచ్చిన బీజేపి ఇప్పుడు రామ్ విషయంలో కాస్తా వెనక్కి జరిగింది. రాముడు విషయంలో బీజేపికి క్లారటీ కొరవడింది. అయితే మేము చెబుతున్న రాముడు శ్రీరాముడు కాదు, బీహార్ ముఖ్యమంత్రి జితిన్ రామ్ మాంఝీ. జితిన్ రామ్ మాంఝీ పార్టీ నేతలపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన సమయం నుంచి ఇప్పటి వరకు ఆయకు వెన్నుదన్నుగా నిలిచింది బీజేపీయేనన్నది అక్షర సత్యం. అయితే ఇప్పుడు మాత్రం తమకేం సంబంధం లేదంటోంది.

నిజంగానే రామ్ చెబుతున్నట్లు తమ వెనుక పెద్ద సంఖ్యలో ఎమ్మెల్యేలు వున్నారన్న వార్తలను నమ్మింది కాబోలు.. అందుకే ఇప్పటి వరకు మద్దతు ఇచ్చిన బీజేపి ఇవాళ విశ్వాస పరీక్ష నేపథ్యంలో వెనక్కు జరిగింది. జితిన్ రామ్ మాంఝీకి మద్దతుగా బాహార్ అసెంబ్లీ ఎదుట ధర్నాకు కూడా దిగింది. అక్కడ పార్టీ ఎమ్మెల్యేలు జితిన్ రామ్ కు మద్దతుగా నిరసన తెలిపారు. జనతాదళ్ యునైటెడ్ మహా దళిత సమాఖ్యను, ఆ వర్గం ప్రజలను మోసం చేసిందని అరోపించారు.

బీహార్ లోని రాజకీయ సంక్షోభంపై ఎట్టకేలకు స్పందించిన పార్టీ అధికార ప్రతినిధి షానవాజ్ హుస్సేస్.. బీహార్ ప్రభుత్వంలో రాజకీయ సంక్షోభానికి తమకు ఏమాత్రం సంబంధం లేదని ఆ తేల్చిచెప్పారు. అంతేకాదు తాము ఓక దళిత వర్గం నాయకుడికి అన్యాయం జరగకూడదనే ఆయనకు మద్దతుగా నిలచామని స్పష్టం చేసింది. దళిత నేతకు జరుగుతున్న అవమానం పట్ల, ఆయనను పదవీ చ్యుతుడిని చేసే పక్రియకు నిరనసగా ఆందోళన బాట పట్టామని చెప్పింది. అయితే మరి జితిన్ రామ్ కు అండగా నిలచి విశ్వాస పరీక్షలో కూడా ఎందుకు మద్దతు ఇవ్వలేదో చెప్పలేదు. దీంతో రాముడి విషయంలో బీజేపికి క్లారిటీ కోరవడిందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahnawaz Hussain  Nitish Kumar  Jitan Ram Manjhi  

Other Articles