Srilankan navy force attacked on indian fisher man

srilanka on india, sirisena, modi, fisherman, navy officers, rameshwaram, pamban island, fishermen at india boardar

srilankan navy force attacked on indian fisher man : pm modi and srilankan president sirisena conference at delhi on two countyrs several issues. they trying to solve the fishermen problems, and they also decided to mutual understand.

భారత జాలర్లపై శ్రీలంక నావికాదళం దాడి

Posted: 02/20/2015 09:07 AM IST
Srilankan navy force attacked on indian fisher man

భారత ప్రధాని నరేంద్ర మోదీ, శ్రీలంక అధ్యక్షుడు సిరిసేనల మధ్య సాగిన చర్చలు, కుదుర్చుకున్న ఒప్పందాలతో రెండు దేశాల మధ్య సత్సంబంధాలు మరింత బలపడ్డాయి. తమిళ జాలర్ల సమస్యకు పరిష్కారం చూపే విధంగా రెండు దేశాల నేతలు వ్యాఖ్యలు సైతం చేశారు. అయితే, ఆ వాఖ్యలు చేసి కొన్ని గంటలైనా కాలేదు. ఇటు శ్రీలంక అధ్యక్షుడు సిరిసేన పర్యటన భారత్‌లో ముగిసిందో లేదో, అటు కచ్చదీవుల్లో తమ ప్రతాపాన్ని చూపించే పనిలో ఆ దేశ నావికాదళం నిమగ్నం అయింది.
 
 రామేశ్వరం, మండపం, పంబన్ పరిసరాలకు చెందిన 2వేల మందికి పైగా జాలర్లు కచ్చదీవుల్లో వేటలో నిమగ్నమయ్యారు. వలలను విసిరి చేపల్ని వేటాడే పనిలో ఉన్న జాలర్లపై చిన్న నౌకలో వచ్చిన శ్రీలంకా నావికాదళం విరుచుకు పడింది. ఇక కచ్చదీవుల్లోకి వస్తే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరిస్తూ జాలర్లు విసిరిన వలల్ని తెంచి పడేసి వీరంగం సృష్టించారు. దీంతో ఆందోళన చెందిన జాలర్లు తమ పడవలతో ఒడ్డుకు పరుగులు తీశారు. మూడు పడవల్లో ఉన్న కొందరు జాలర్లను నావికాదళం చితక్కొట్టి వదిలి పెట్టింది. ఆ పడవలో ఉన్న వలల్ని, వేటాడిన చేపల్ని సముద్రంలో పడేశారు. వలల్ని తెంచి పడేయడంతో తీవ్రంగా నష్ట పోవాల్సి వచ్చిందని కన్నీటి పర్యంతమవుతున్నారు. సిరి సేన భారత పర్యటన ముగియగానే, ఈ దాడి జరగడం, మళ్లీ కచ్చదీవుల్లోకి వస్తే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని ఆ దేశ నావికాదళం హెచ్చరించడాన్ని జాలర్ల సంఘాలు తీవ్రంగా పరిగణించాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles