Arun jaitley and some financial ministry officers taste the halwa at the budget starting ceremony

halwa, budget, arun jaitly, finance, financial statement, financial officials, budget printing

arun jaitley and some financial ministry officers taste the halwa at the budget starting ceremony : for the 2015-16 budget central finance minister arun jaitly and other officers start the excercise on budget. in thie occation they taste the special halwa.

బడ్జెట్ తయారీకి అంతా సిద్దం..హల్వా తో శుభారంభం

Posted: 02/20/2015 08:22 AM IST
Arun jaitley and some financial ministry officers taste the halwa at the budget starting ceremony

పార్లమెంటులో ఈ నెల 28న ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ ప్రవేశపెట్టనున్న 2015-16 బడ్జెట్ పత్రాల ముద్రణా ప్రక్రియ ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం బడ్జెట్ తయారీకి ముందు ఆర్థిక శాఖ మంత్రి, ముఖ్య అధికారులు హల్వా రుచిచూడటం ఆనవాయితీ. ఎప్పటిలాగా ఈ సారి కూడా  ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ సహా, ఆర్థికశాఖ సహాయమంత్రి జయంత్ సిన్హా, ఆర్థిక కార్యదర్శి రాజీవ్ మహర్షి, రెవెన్యూ కార్యదర్శి శక్తికాంత్ దాస్, జాయింట్ సెక్రటరీ ఆఫ్ బడ్జెట్ రజిత్ భార్గవ, ఆర్థిక మంత్రిత్వశాఖ సిబ్బంది, హల్వా రుచిచూసి బడ్జెట్ కసరత్తులు మొదలు పెట్టారు.

బడ్జెట్ తయరీకి సంబందం ఉన్న వారు అందరు, బడ్జెట్ కు తుది రూపం వచ్చే వరకు బయటి ప్రపంచంతో సంబందాలు ఉండవు. బడ్జెట్ తయారీ, ప్రింటింగ్ ప్రక్రియతో ప్రత్యక్షంగా సంబంధమున్న అధికారులు, వారికి సహాయ సహకారాలు అందించే సిబ్బంది అంతా నార్త్‌బ్లాక్ కార్యాలయానికే పరిమితమైపోతారు. లోక్‌సభలో ఆర్థికమంత్రి బడ్జెట్‌ను ప్రవేశపెట్టేంతవరకూ వారి కుటుంబాలతో సైతం వారు కలవరు. ఫోనులోకానీ, ఈ-మెయిల్ లాంటి మరేదైనా కమ్యూనికేషన్ రూపంలో కానీ వారి ఆప్తులను సైతం సంప్రదించడానికి వీలుండదు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : halwa  budget  arun jaitly  finance  financial statement  financial officials  budget printing  

Other Articles