Ramanaidu death movie moghal tollywood bandh

dasari narayana rao news, ramanaidu death news, rama naidu studio, ramanaidu theatres, rama naidu latest updates, tollywood bandh

ramanaidu death movie moghal tollywood bandh : Tollywood bandh on thursday to condolences rama naidu death.

తెలుగు సినీ పరిశ్రమ బంద్

Posted: 02/18/2015 07:17 PM IST
Ramanaidu death movie moghal tollywood bandh

దాదాపు 15 భాషల్లో వందకుపైగా చిత్రాలను నిర్మించి గిన్నెస్ రికార్డులకెక్కిన మూవీ మోఘల్ గా డి.రామానాయుడు ఆకస్మిక మృతి చెందడంపై టాలీవుడ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయనలాంటి లెజెండరీ ప్రొడ్యూసర్ ఇంతవరకు ఎవరూలేరని అభిప్రాయం వ్యక్తం చేసిన టాలీవుడ్.. ఆయన సంతాపసూచకంగా బంద్ ప్రకటించనుంది. ఈమేరకు దర్శకరత్న దాసరి నారాయణరావు తెలిపారు.

శతాధిక సినిమాల నిర్మాత, మూవీ మోఘల్ రామానాయుడు మృతికి సంతాపసూచకంగా రేపు (గురువారం) తెలుగు సినీ పరిశ్రమ బంద్ కానుందని దాసరి పేర్కొన్నారు. ఆయన పార్థివదేహాన్ని సందర్శించిన అనంతరం దాసరి పై విధంగా స్పందించారు. అలాగే ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ఆయనలాంటి గొప్ప నిర్మాత ఇండస్ట్రీలో మరొకరు లేరని పేర్కొన్నారు.

ఇదిలావుండగా... టాలీవుడ్ లో వున్న ప్రతిఒక్కరితోనూ రామానాయుడికి ఏదో ఒకరకమైన అనుబంధం వుంది. స్టూడియో అధినేతగా, నిర్మాతగా, డిస్ట్రిబ్యూటర్ గా, సినిమా హాళ్ల అధినేతగా.. ఇలా పలురకాలైన సంబంధాలు వున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలుగు సినీ పరిశ్రమ మొత్తం ఆయన మృతికి సంతాపం ప్రకటించనుంది. దీంతో గురువారం రాష్ట్రవ్యాప్తంగా వున్న సినిమాహాళ్లు కూడా మూతపడుతాయి.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : dasari narayana rao  ramanaidu death news  tollywood bandh  

Other Articles