3 members died with cellphone charge effect

cellphone died, cellphone charge died, cellphone shock effect, electrical cellphone charge

3 members died with cellphone charge effect : In just 24 hours of duration.. 3 members died with cellphone charge effect while they try to plug charge to their mobile.

ముగ్గురి ప్రాణాలను బలితీసుకున్న ‘సెల్ ఫోన్’

Posted: 02/18/2015 02:55 PM IST
3 members died with cellphone charge effect

ప్రస్తుత ఫాస్ట్ జనరేషన్ లో సెల్ ఫోన్ వినియోగదారులు ఏవిధంగా పెరుగుతున్నారో.. అలాగే దానివల్ల మరణించేవారి సంఖ్య పెరుగుతోంది. దాంతో కాస్త అప్రమత్తంగా వుండకపోతే చాలు.. ఏకంగా అది ప్రాణాలనే తీసేసుకుంటోంది. సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టేటప్పుడు గానీ, చార్జింగ్ లో వున్న ఫోన్ లో మాట్లాడుతున్నప్పుడు గానీ షాక్ తగిలి మృత్యువాత పడుతున్నారు. ఇలా మరణించినవారి సంఖ్య విదేశాల్లోకంటే భారత్ లోనే మరింతగా పెరిగిపోతోంది. తాజాగా 24 గంటల వ్యవధిలోనే ఈ ‘సెల్ ఫోన్’ ముగ్గురు నిండుప్రాణాలను బలితీసుకుంది.

నల్లగొండ జిల్లా తిరుమల గిరి మండల వెలిశాలకు చెందిన బొమ్మెర సోమనర్సయ్య(55) అనే వ్యక్తి.. సోమవారం రాత్రి తన ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెట్టేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో షాక్ తగిలి అతను అక్కడికక్కడే మరణించాడు. ఈ విధంగానే వరంగల్ జిల్లా సంగెం మండలం వంజరపల్లి గ్రామ శివారులోని రేఖియా తండాకు చెందిన బానోతు రాజశేఖర్ (26) సోమవారం రాత్రి బల్బు హోల్డర్‌కు సెల్‌చార్జర్‌ను కనెక్ట్ చేయడానికి ప్రయత్నించాడు. అయితే.. ఛార్జర్ కు విద్యుత్ సరఫరా అయిపోవడంతో అతనికి షాక్ కొట్టి అక్కడికక్కడే మృతిచెందాడు.

ఇక వరంగల్ జిల్లాలోని గీసుకొండ మండలం నందనాయక్‌తండా శివారు ఎస్‌టీ తండాకు చెందిన బాదావత్ నరేశ్ (20) మంగళవారం సాయంత్రం తమ ఇంట్లో సెల్‌ఫోన్‌కు చార్జింగ్ పెడుతుండగా.. షాక్ కొట్టి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. బంధువులు వెంటనే అతనిని ఆసుపత్రికి తరలించేందుకు ప్రయత్నించగా.. మార్గమధ్యంలో చనిపోయాడు. ఈ రకంగా మరెంతోమంది తమ ప్రాణాలు కోల్పోతూనే వున్నారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : electrical cellphone charge  cellphone effect 3 members died  

Other Articles