అదొక పెళ్లి మండపం.. సగానికిపైగా పెళ్లి తంతు పూర్తయ్యింది.. బంధువులంతా ఎంతో సంతోషంగా వున్నారు.. అక్కడి వాతావరణం ఎంతో సందడిగా వుంది.. వధూవరులిద్దరూ దండలు మార్చుకోవడానికి సిద్ధమయ్యారు.. కానీ ఇంతలోనే ఓ ఘటన చోటు చేసుకుంది. అంతే! పెళ్లికొడుకుని పక్కనపెట్టేసి అతిథిగా వచ్చిన యువకుడిని వరించింది వధువు. సగటు సినిమా కథకు ఏమాత్రం తీసిపోని ఈ ఘటన యూపిలోని మొరాదాబాద్ సమీపంలో చోటు చేసుకుంది.
వివరాళ్లోకి వెళ్తే.. జుగల్ కిశోర్ (23) అనే యువకుడికి ఇందిర (23) అనే అమ్మాయితో పెళ్లి కుదిరింది. అన్ని అనుకున్నట్లుగానే పెళ్లి కార్యక్రమాలు సవ్యంగా జరిగాయి. పెళ్లి మండపం అంతా హడావుడిగా వుంది. ఈ పెళ్లి తంతులో భాగంగా దండలు మార్చుకుంటుండగా స్టోరీ మొత్తం మారిపోయింది. వధువుకు వర్తమాల వేస్తూ వరుడు కిషోర్ ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. ఎందుకతనలా పడిపోయాడు..? అని విశ్లేషించగా.. అతగాడు మూర్ఛరోగంతో బాధపడుతున్నాడన్న విషయం వెల్లడైంది. అంతే! తీవ్ర ఆగ్రహానికి గురైన వధువు.. తనదైన రీతిలో వరుడు కుటుంబసభ్యులకు బుద్ధి చెప్పింది.
వరుడు కిషోర్ కి వున్న మూర్ఛరోగాన్నా దాచిపెట్టి వివాహం జరుపుతారా? అని వరుడి కుటుంబసభ్యులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాదు.. తనను మోసం చేసిన వారికి బుద్ధి చెప్పేందుకు తన పెళ్లికి అతిథిగా వచ్చిన హర్పాల్ సింగ్ అనే యువకుడిని అప్పటికప్పుడే వరించింది. అందరూ చూస్తుండగానే ఆమె సదరు యువకుడితో పెళ్లి చేసుకుంది. తనతో ఇలా జరగడంపై మొదట ఆశ్చర్యానికి గురైన హర్పాల్.. చివరికి ఆమెను భార్యగా అంగీకరించాడు. దీంతో అక్కడికక్కడే వారిద్దరికీ పెళ్లి జరిగిపోయింది. వీరి పెళ్లిని వధువు కుటుంబసభ్యులు కూడా అంగీకరించారు. దీంతో వరుడు కుటుంబసభ్యులు తలదించుకుని వెళ్లిపోవాల్సి వచ్చింది.
మరోవైపు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకున్న కిషోర్.. తిరిగి వచ్చి ఇందిరను భయపెట్టాడు. అయితే ఆమె ఏమాత్రం జంకకుండా ధైర్యంగా ఎదురు నిలిచింది. తమకు జరిగిన అవమానాన్ని భరించలేకపోయిన కిషోర్ బంధువులు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. కానీ.. పెద్దలు వారించడంతో వారు ఆ ఫిర్యాదును వెనక్కు తీసుకున్నారు. దీంతో ఈ కథ సుఖాంథమైంది.
(And get your daily news straight to your inbox)
Aug 22 | అమెరికా అందరికీ ఒక డ్రీమ్. మరీ ముఖ్యంగా ఇంజనీరింగ్ పూర్తి చేసిన మన దేశవాసులకు అందులోనూ తెలుగువారికి అగ్రరాజ్యంలోకి అడుగుపెట్టి.. అక్కడ ఉద్యోగం సంపాదించి, స్థిరపడాలన్నది చాలామంది అభిలాష. ఇప్పటికే ఈ ఆశలు ఉన్నవారు... Read more
Oct 08 | అసలే నవరాత్రి వేడుకలు.. అంతా ఉత్సాహంగా ఉన్నారు.. వీధి మధ్యలో గర్భా నృత్యం చేయడానికి ఏర్పాట్లు చేశారు. యువతులు, మహిళలతోపాటు పురుషులూ బాగా రెడీ అయి వచ్చేశారు. కానీ డ్యాన్స్ మొదలుపెట్టగానే కరెంటు పోయింది.... Read more
Oct 08 | తిరుమలలో భక్త జన సందోహం పెరిగింది. దసరా పండగ తరువాత పండగ సెలవులు ముగింపు దశకు చేరకుంటున్న తరుణంలో శ్రీవారి దర్శనం కోసం భక్తులో పోటెత్తారు. సెలవులతో కూడిన వారాంతం కావడంతో భక్తులు పెద్ద... Read more
Oct 08 | దేశవ్యాప్తంగా వాహనాల రిజిస్ట్రేషన్ కు ఒకటే సిరీస్ అయిన బీహెచ్ విషయంలో కేంద్ర రవాణా శాఖ నిబంధనలను సడలించనుంది. దేశవ్యాప్తంగా ప్రతీ రాష్ట్రానికి విడిగా ఒక రిజిస్ట్రేషన్ విధానం నడుస్తోంది. తెలంగాణ అయితే టీఎస్... Read more
Oct 07 | ప్రముఖ ప్రవచనకర్త గరికపాటి నరసింహరావు ఇటీవల మెగాస్టార్ చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలు దుమారాన్ని రేపుతున్నాయి. మెగాఫాన్స్ మహాపండితుడు గరికపాటిపై నెట్టింట్లో ట్రోల్ చేస్తున్నారు. ఇక దీనికి మెగాబ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ కూడా తోడు... Read more