Formar mp harsha kumar fire on venkayya naidu

mp harsha kumar, venkayya naidu, chandra babu naidu

formar mp harsha kumar fire on venkayya naidu : formar mp harsha kumar fire on cenrtal minister venkaiah naidu. chandrababu always blame the farmers he added.

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు పై మాజీ ఎంపి హర్షకుమార్ ఫైర్

Posted: 02/17/2015 01:29 PM IST
Formar mp harsha kumar fire on venkayya naidu


కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు జోకర్కి ఎక్కువ, బఫూన్కి తక్కవ అని మాజీ ఎంపీ జీవీ హర్షకుమార్ ఎద్దేవా చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనలో కాంగ్రెస్, బీజేపీలు సమాన పాత్ర పోషించాయని ఆరోపించారు. ఏపీలో రైతులకు బద్ధ శత్రువు ఎవరైనా ఉన్నారంటే అది సీఎం చంద్రబాబే అని ఆయన స్పష్టం చేశారు. అధికారంలోకి వచ్చిన ప్రతీసారి రైతులను అన్యాయం చేస్తున్నాడని చంద్రబాబుపై హర్షకుమార్ నిప్పులు చెరిగారు. విభజన చట్టంలోని హామీలు అమలు కావాలంటే పార్లమెంట్ సమావేశాలను స్తంభింప చేయాలని ఆయన కాంగ్రెస్కు హితవు పలికారు. అలా చేస్తేనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి సానుకూలత ఏర్పడే అవకాశాలున్నాయని అభిప్రాయపడ్డారు. నందిగామ, తిరుపతి ఉప ఎన్నికల్లో అభ్యర్థులను నిలబెట్టి మరో తప్పు చేసిందని కాంగ్రెస్ పార్టీని విమర్శించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mp harsha kumar  venkayya naidu  chandra babu naidu  

Other Articles