Ap cm met pm modi

cm chandrababu, pm modi, ap cm delhi tour, central budget, ap special pakage, vizag railway zone, ap capital city

ap cm chandrababu met pm modi in delhi. and he discuss about the funds to ap. babu propose to announce funds to ap in arriving budget. babu also discuss the nagarjuna sagar issue.

కాస్త పెద్ద మనసు చేసుకోండి: చంద్రబాబు

Posted: 02/16/2015 07:42 AM IST
Ap cm met pm modi

ఆర్థికంగా చిక్కుల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద మనసుతో సాయం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కోరారు. రాష్ట్ర విభజన అంశాలను మరోసారి ప్రధాని దృష్టికి తెచ్చారు. ఎన్డీయే భాగస్వామిగా ఉన్నప్పటికీ కనీసం విభజన హామీలను కూడా అమలు చేయించలేకపోయారన్న విమర్శలు వస్తున్నాయని ప్రధాని వద్ద ఆవేదన వ్యక్తంచేసినట్టు సమాచారం.నాగార్జునసాగర్ డ్యామ్ వద్ద జరిగిన ఘర్షణపై కూడా వివరణ ఇచ్చినట్టు తెలుస్తోంది.

రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాజధాని నిర్మాణానికి చాలినంత సాయం చేయాలని ప్రధాన మంత్రిని ముఖ్యమంత్రి కోరారు. 13వ ఆర్థిక సంఘం సిఫారసు చేసిన నిధులను బకాయిలు లేకుండా ఒకే విడతగా విడుదల చేయాలని కోరారు. వెనకబడిన జిల్లాలకు ప్రకటించిన ప్యాకేజీ చాలా తక్కువగా ఉందని, దాన్ని పెంచాలని బాబు విజ్ఞప్తి చేశారు. విశాఖ రైల్వే జోన్ ప్రకటన ఈ రైల్వే బడ్జెట్‌లో ఉండేలా చూడాలని కూడా కోరారు.కేంద్ర సాధారణ బడ్జెట్‌లో విభజన అంశాలన్నీ ఉండేలా చూడాలని ప్రధానిని కోరారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : ap cm delhi tour  central budget  ap special pakage  vizag railway zone  ap capital city  

Other Articles