Large amount of gold missing in padmanabhaswamy temple

Padmanabhaswamy Temple, Large Amount Of Gold Missing, gold missing, kerala, CAG Chairman vinod roy, travancore hyrarchy, vinod roy report

Large Amount Of Gold Missing In Padmanabhaswamy Temple

అనంతుడికి పంగనామాలా..? బంగారం గోవిందా..?

Posted: 02/14/2015 09:26 PM IST
Large amount of gold missing in padmanabhaswamy temple

ప్రపంచంలోనే అత్యంత ఆస్తులను కలిగిన ఆలయంగా పేరు తెచ్చుకున్న తిరువనంతపురం అనంత పద్మనాభస్వామికే పంగనామాలు పెట్టారు. కేరళలోని అనంత పద్మనాభ స్వామి దేవాలయం నేలమాలిగల్లో 266 కిలోల బంగారం మాయమైందని అనుమానాలు ఇప్పడు నిజమయ్యాయి. ఈ విషయాన్ని తన ఆడిట్ నివేదికలో మాజీ కాగ్ చీఫ్ వినోద్ రాయ్ చెప్పారు. కోర్టుకు ఇచ్చిన నివేదికలో గత ఏడాది గుడి ఆదాయ వ్యయాలు, ఆస్తులు, స్వర్ణాభరణ వివరాలను గణించాలని సుప్రీం కోర్టు రాయ్‌ని ఆదేశించిన నేపథ్యంలో ఆయన ఈ విషయాన్ని వ్యక్త పర్చినట్లు సమాచారం
 
ఆలయంలోని భూగర్భ మాళిగల్లో లభించిన సంపద విలువ రూ.1 లక్ష కోట్లకు పైనే ఉంటుందని రాయ్ తెలిపారు. అయితే నేలమాలిగల్లో భయటపడని సంపదలో సుమారు 266 కిలోల బంగారాన్ని పలువరు తస్కరించారు. ఇంతకీ తస్కరించింది ఆలయ సిబ్బందా..? లేక మరెవరన్న విషయాలు తెలియాల్సి వుంది. ఈ నేలమాళిగల్లోని ఇంకా 'బి' అని పేరు పెట్టిన గదిని తెరవాల్సి వుందని వివరించారు. వివిధ పనుల నిమిత్తం 893 కిలోల బంగారాన్ని దేవస్థానం ఇవ్వగా, కేవలం 627 కిలోలు మాత్రమే వెనక్కు వచ్చినట్టు రాయ్ తన నివేదికలో తెలిపారు. ఈ నివేదికపై ట్రావెన్ కోర్ రాజ కుటుంబం స్పందించాల్సి వుంది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gold  Padmanabhaswamy Temple  kerala  

Other Articles