Ramleela geared up for arvind kejriwal s swearing in ceremony

Arvind Kejriwal's swearing-in ceremony, Aam Aadmi Party AAP, Arvind Kejriwal, Delhi, Delhi Assembly Election 2015, Narendra Modi, prime minister modi, delhi cm swearing-in ceremony,

ramleela geared up for Arvind Kejriwal's swearing-in ceremony

కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారానికి సిద్దమైన రాంలీలా..

Posted: 02/14/2015 12:28 AM IST
Ramleela geared up for arvind kejriwal s swearing in ceremony

ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ఢిల్లీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారానికి రామ్‌లీలా మైదానంలో ఏర్పాట్లు జరుగుతున్నాయి. శనివారం ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. కేజ్రీ కేబినెట్‌లో ఆరుగురు ఎమ్మెల్యేలు, మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. మనిష్‌ సిసోడియాకు డిప్యూటీ సీఎం హోదా దక్కనుంది.

ప్రమాణస్వీకారంలో పాల్గొనే ఎమ్మెల్యేల వివరాలను ఆప్‌ పార్టీ గవర్నర్‌ నజీబ్‌ జంగ్‌కు పంపింది. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పార్టీ 70 సీట్లకు గానూ 67 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వ ఏర్పాటుకు సిద్ధమైంది. ఢిల్లీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషించిన ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత మనిష్‌ సిసోడియా కేజ్రీవాల్‌ కేబినెట్‌లో డిప్యూటీ సీఎంగా వ్యవహరించనున్నారు. ఆయనతోపాటు మరో ఆరుగురు ఎమెల్యేలు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు. సత్యేంద్ర జైన్‌ ఒక్కరే గతంలో కేజ్రీ కేబినెట్‌లో ఉన్నారు.

కాగా కేజ్రీవాల్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి దేశంలోని మిగిలిన ముఖ్యమంత్రులను అహ్వానించడం లేదు. కేవలం ప్రదాన మంత్రి నరేంద్రమోడీని మాత్రమే ఆయన తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఆహ్వనించారు. అయితే కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవానికి ప్రధాని హాజరవుతారా..? లేదా..? అంటే లేదని ప్రధానమంత్రి కార్యాలయ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారోత్సవం సందర్భంగా రాంలీలా మైదానం దాని పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలను విధించారు ఢిల్లీ పోలీసులు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP  Arvind Kejriwal  swearing-in ceremony  delhi  

Other Articles