Nitish kumar made a big mistake by making me chief minister says cm manjhi

Nitish Kumar made a big mistake, manjhi says nitish assumed me as puppet, Manjhi expelled from JD(u), nitish kumar to return as bihar cm, Manjhi appealed to dissolve assembly, manjhi appealed governor KN Tripathi to dissolve assembly, Nitish Kumar, Jitan Ram Manjhi, Dissolution, Bihar CM, bihar assembly polls, Bihar CM, Jitam Ram Manjhi, Narendra Modi, Nitish Kumar, Political Play, Sharad Yadav, janata dal united president

Former CM Nitish Kumar on Friday got a befitting reply from the Chief Minister of Bihar Jitan Ram Manjhi when he in order to clarify his stand reverted back and said the allegations against him were being made in order to pressurise him to step down before the trust vote.

నన్ను ముఖ్యమంత్రిని చేసి పెద్ద తప్పు చేశారు..

Posted: 02/13/2015 01:39 PM IST
Nitish kumar made a big mistake by making me chief minister says cm manjhi

తనను ముఖ్యమంత్రిని చేసి నితీష్ తప్పు చేశాడని బీహార్ ముఖ్యమంత్రి, జేడీ యు బహిష్కృత నేత జతిన్ రామ్ మాంఝీ అన్నారు. తనను ఓ ఆట వస్తువులా చూడటం.. వారు చెప్పిందల్లా చేస్తాననుకుని పెద్ద తప్పు చేశారని ఆయన వ్యాఖ్యానించారు. తనను తన చేతిలో కీలుబోమ్మగా వాడుకునేందుకే నితీష్ కుమార ప్రయత్నించారని ఆరోపించారు. తన మార్గనిర్ధేశకుడి వ్యవహార శైలి తనను బాధించిందన్నారు. ఇందుకు ఇప్పుడాయన తగిన  మూల్యం చెల్లించుకుంటున్నారని పేర్కొన్నారు.

తనను పదవీచ్యుతుడిని చేసి అధికారం లాగేసుకుని, పీఠం ఎక్కాలనుకున్న నితీష్ ఇందుకోసం పార్టీ ఎమ్మెల్యేలను పావులుగా వాడుకుంటున్నారన్నారు. ఎమ్మెల్యేలకు ఎదో లబ్ది చేకూరస్తామని హామి ఇచ్చారని, అయితే అధికారం చేతికందక పోవడంతో నిధులు విడుదల చేసే మార్గం కనబడక దిక్కుతోచని స్థితిలోకి జారుకున్నారని నితీష్ పై మండిపడ్డారు. ఇలాంటి ఆటలు తనకు రావని తాను నిరుపేదనని, ఈ తరహా రాజకీయ చాతుర్యం ప్రదర్శించేందుకు తన వద్ద నిధులు కూడా లేవని మాంఝీ అన్నారు  అయితే నితీష్ కుమార్ తో ఢిల్లీకి వెళ్లిన ఎమ్మెల్యేలకు కూడా ఆయన లక్ష్ల రూపాయలను వెచ్చించారని తెలిపారు. నితీష్ కుమార్ ఇలాంటి ఆటలలో అగ్రగన్యుడని వ్యంగంగా వ్యాఖ్యానించారు.

తాను ఎట్టువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోనని తే్ల్చిచెప్పిన మాంఝీ.. ఈ నెల 20న నిర్వహించే విశ్వాస పరీక్షను ఎదుర్కొంటానన్నారు. విశ్వాస పరీక్షను గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే అక్కడ ఎలాంటి పరిణామాలైన చోటుచేసుకోవచ్చని చెప్పారు. తాను ఎప్పుడు ముఖ్యమంత్రిని అవుతానని అలోచించలేదని, అలాంటి తనకు పీఠం ఇచ్చిన పెద్ద మనిషే తప్పుడు చర్యలు చేయమని ప్రోత్సహిస్తే.. తాను చేయనని ఇందుకు తన మనస్సు అంగీకరించదని మాంఝీ తెలిపారు

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Jitan Ram Manjhi  Trust vote  Bihar CM  

Other Articles