Mutant pig with human face and penis on its forehead dead

Mutant pig with human face, china deformed piglet dead, farmer inundated with cash offers, Pictures of the deformed piglet went viral, china piglet attracted visitors and bids, Mutant pig having penis on its forhead., Tao Lu,

Pictures of the deformed piglet - which was one of the last to be born in a litter of 19 - went viral, attracting visitors and bids for the animal

ITEMVIDEOS: మానవ ఆకారంలో వరాహం.. నాలుగు రోజుల్లోనే మరణం..

Posted: 02/13/2015 01:06 PM IST
Mutant pig with human face and penis on its forehead dead

ప్రపంచవ్యాప్తంగా సంచలనాన్ని రేకెత్తించి.. అరుదైన వింతగా నమోదు చేసుకున్న మానవ అకారంలో జన్మించిన వరాహం:.. అంతలోనే అసువులు బాసింది. జన్మించిన నాలుగు రోజుల్లోనే అనంత వాయువులలో కలసిపోయింది. చైనాలో నానింగ్ నగరంలో గల యానన్ టౌన్ షిఫ్ ప్రాంతంలో నివసించే టావ్ లూ అనే రైతుకు చెందిన వరాహం 19 పిల్లలను కనింది. అన్ని పిల్లలు సాధరణంగానే వున్నా.. చిట్టచివరిది, 19 అయిన పిల్ల మానవ ఆకారంలో జన్మించింది. అంతేకాదు దాని నుదిటిపై మర్మాంగం కూడా వుంది. అత్యంత వింతగా జన్మించిన ఈ పంది పిల్ల ఫోటోలను స్థానిక మీడియాకు అందించాడు. స్థానిక మీడియా వాటిని ప్రచురించడంతో ఆ వింత వరాహాన్ని చూసేందుకు జనాలు బారులు తీరారు. అంతేకాదు యజమానికి కూడా బంపర్ ఆఫర్లు వచ్చాయి

మానవాకారంలో వింతగా జన్మించిన వరాహాన్ని తమకు అందిస్తే తాము డబ్బులు ఇస్తామని కొందరు లూ వెంట పడ్డారు. అయితే టూ వాటికి ఆశపడ్డకపోవడం కూడా మంచిదైంది. ఎందుకంటే ఆ వరాహం నాలుగు రోజులకే మరణించింది. వింతగా వుండటంతో తన పిల్ల కాదనుకున్న తల్లి వరాహం దానిని చెంతకు రానివ్వలేదు. దానికి పాలు తాగనివ్వలేదు. యజమాని దానిని బాటిల్ తో పాలు పట్టేందుకు యత్నించిగా అది నిరాకరించింది. దీంతో ఆకలికి మలమలా మాడుతూ.. నాలుగు రోజుల్లోనే వింత వరాహం మరణించింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Mutant pig  human face  viral  dead  

Other Articles