United states tried to battle on islamic state

us battle, isis, islamic states, afghan battle, barak obama, president bush

united states tried to battle on islamic state : america president propose to battle on islamic states. american troops are ready to fight againist the terrorists.

ప్రత్యేకం: అమెరికా మరోసారి యుద్దానికి సిద్దమవుతోందా...?

Posted: 02/12/2015 06:39 PM IST
United states tried to battle on islamic state

ఒబామా మరో బుష్ లా మారనున్నారా.. ? బుష్ అప్పుడు ఆప్ఘనిస్తాన్ మీద తీసుకున్న చర్యనే ఒబామా ఇప్పడు ఇస్లామిక్ స్టేట్ పేరుతో తీసుకోబోతున్నారా..?  యుద్దం అంటేనే అమెరికా ఎందుకు కాలుదువ్వుతుంది..? ఇలా చాలా ప్రశ్పలు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా "ఇస్లామిక్ స్టేట్ కు వ్యతిరేకంగా యుద్దం చెయ్యడానికి మద్దుతు ఇవ్వండ అంటూ చట్ట సభల్లో చేసిన ప్రతిపాదన హాట్ టాపిక్ గా మారింది. "మన దేశాన్నే లక్షంగా చేసుకున్న వారికి మనం అవకాశం ఇవ్వకూడదు" అన్న ఒబామా మాటలు ఎంత వరకు సత్యాలు. ఇలా అమెరికా అనుకుంటున్నది నిజంగా జరగబోతోందా...? లేదా అమెరికా తన స్వప్రయోజనాల కోసం మరో సారి యుద్దానికి సిద్దమవుతోందా...? అన్నది ప్రశ్న.

అమెరికా..ప్రపంచంలో అగ్రరాజ్యంగా పేరుగాంచింది. అన్ని దేశాల వ్యవహారాల్లోనూ వేలుపెడుతూ, తన ప్రయోజనాలను చూసుకుంటుంది ఈ దేశం. అమెరికా తీసుకునే ప్రతి చర్య భవిష్యతులో ఆ దేశానికి ఎంతో మేలు చేసేలా ఉంటుంది. ప్రతి అంశంలోనూ వ్యాపార ధోరణ అమెరికా నైజం. గతంలో తన దేశంలో చమురు నిక్షేపాల కొరత ఉండటంతో చమురు నిక్షేపాలున్న దేశాలతో స్నేహం చేసింది. అవకాశం దొరికినపుడు వాటిని తన మాటకు కట్టుబడేలా చేసుకుంది. అలా అగ్రరాజ్యం అన్ని దేశాలను శాసిస్తూ, ఏకచక్రాధిపత్యాన్ని సాగిస్తోంది.

కేవలం అమెరికా మాత్రమే అగ్రరాజ్యం హోదా లేదా పెద్దన్న హోదా కలిగి ఉండటాన్ని కొన్ని దేశాలు  ఖండించాయి.  ప్రధానంగా సోవియట్ రష్యా అమెరికా వైఖరిపై ఎప్పుడూ నిలదీస్తూ ఉండేది. అమెరికా ఎప్పుడు అవకాశం దొరుకుతుందా సోవియట్ రష్యాను ఎలా దెబ్బకొడదామా అని ఆలోచిస్తూ ఉండేది. మొత్తానికి అవకాశం రావడంతో సోవియట్ రష్యా ఛిన్నాభిన్నం కావడానికి తన వంతు పాత్ర పోషించింది. ఇలా అగ్రరాజ్యం తన ఎదుగుదలకు అడ్డొచ్చిన అన్ని దేశాలతోనూ ఇదే వైఖరిని కొనసాగించింది, భవిష్యత్తులోనూ అలానే కొనసాగిస్తుంది.

ఇక అమెరికా రక్తంలోనే యుద్ద కాంక్ష ఎక్కువ. ఎప్పుడు యుద్దానికి సిద్దపడదామా. మన ప్రతాపాన్ని చూపిద్దామా అని ఎదురు చూస్తుంది అమెరికా. అప్పట్లో జార్జ్ బుష్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు టెర్రరిజం మీద యుద్దాన్ని ప్రకటించింది. తీవ్రవాదం మీద యుద్దమంటే అందరికీ మంచిదే కదా అని ఆలోచించిన ప్రపంచ దేశాలకు నిరానే మిగిలింది . నాటో దళాలతో పాటు, అమెరికా తన స్వంత బలగాలను ఆఫ్ఘనిస్థాన్ కు తరలించింది. అక్కడ దాదాపుగా దశాబ్దంపైగా మారకాండను సృష్టించింది. ఎంతో మంది తీవ్రవాదులతో పాటు మామూలు జనాలను కూడా ఈ యుద్దంలో చంపేసింది. అదే సమయంలో అక్కడ ఉన్న విలువైన చమురు నిక్షేపాలను తన స్వంతం చేసుకుంది. ఇలా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని తనకు అనుకూలంగా మార్చుకోవడంలో ఎంతో నేర్పరి అమెరికా.

అప్పట్లో బుష్ చేసిన యుద్దంపై  విమర్శల వర్షం కురిసింది. ఇప్పుడు అమెరికా మాజి అధ్యక్షుడు బుష్  తను చేసింది తప్పే అంటూ ఒప్పుకున్నారు. ప్రపంచ దేశాలు ఎంత వ్యతిరేకించినా తన పంతానే నెగ్గించుకుంది అమెరికా. ఇప్పుడు కూడా అదే సీన్ రిపీట్ అవుతుందా అని భయం కలుగుతోంది. అప్పుడు బుష్ చేసిన తప్పునే ఇప్పుడు ఒబామా చెయ్యబోతున్నారా. అంటే  పరిస్థితులు మాత్రం అవుననే చెబుతున్నాయి. ఒబామా చట్టసభల్లో ప్రతిపాదన అదే విషయాన్ని తెలుపుతోంది. అయితే ఒబామాకు, బుష్ కు ఓ ప్రధాన తేడా ఉంది. బుష్ దూకుడు మనస్తత్వంతో యుద్దానికి కాలు దువ్వారు. కానీ ఒబామా మాత్రం చట్టసభల్లో తన ప్రతిపాదన ఉంచారు. అమెరికా అధ్యక్షుడిగా ఒబామా చాలా వివేకంగా ఆలోచిస్తారనే నమ్మకం చాలా మందికి ఉంది,

ఇస్లామిక్ స్టేట్ పేరుతో ఓ ఉగ్రవాద సంస్థ ప్రధానంగా అమెరికా, బ్రిటన్ లాంటి అగ్రరాజ్యాలకు చెందిన వ్యక్తులను , సంస్థలను టార్గెట్ చేస్తోంది. తాజాగా జపాన్ కు చెందిన పౌరులను అతిదారుణంగా హతమార్చింది. అయితే ప్రపంచ వ్యాప్తంగా ఇస్లామిక్ స్టేట్ కు ఇంతకింతకు మద్దతు పెరుగుతోంది. ఇదే ఇప్పుడు అందిరిని కలవరపెడుతున్న అంశం. ఇస్లామిక్ స్టేట్ పేరుతో జరుగుతున్న నరమేధాన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. కానీ ప్రత్యక్ష యుద్దం ద్వారానా కాదా అన్నది ప్రశ్న. అందులోనూ అమెరికా లాంటి దేశం యుద్దానికి దిగితే పరిణామాలు ఎలా ఉంటాయన్నది మరో ప్రశ్న. మొత్తానికి అమెరికా తీసుకునే ప్రతి నిర్ణయం యావత్ ప్రపంచాన్ని ప్రభావితం చెయ్యగలదన్నది వాస్తవం. ఒబామా భవిష్యత్తులో ఎలాంటి నిర్ణయాలను తీసుకుంటారో చూడాలి. ప్రపంచ శాంతిని కాంక్షించే ఏ దేశమూ యుద్దాన్ని కోరుకోదు. యుద్దం లేకుండా ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందేమో వెతకాల్సిన అవసరం ఉంది. ఆ దిశగా ప్రపంచ దేశాలు ముందడుగు వేస్తాయని ఆశిద్దాం ..
  - అభినవచారి

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : us battle  isis  islamic states  afghan battle  barak obama  president bush  

Other Articles