Waves of protests mount in andhra pradesh capital area

proposed andhra pradesh capital area, waves of protests mount in capital area, Farmers staged against officials, farmers given objection letters, farmers ageinst land pulling, proposed area of the capital, Farmers staged, Objection documents, guntur district,

farmers on protest in andhra pradesh capital area stating that the officials are taking their objection letters in regard of land pulling

రాజధానిలో రైతుల నిరసనలు.. ఎట్టకేలకు స్పందించిన అధికారులు..

Posted: 02/11/2015 08:05 AM IST
Waves of protests mount in andhra pradesh capital area

గుంటూరు జిల్లాలోని రాజధాని ప్రతిపాదిత ప్రాంతంలో రైతులు ఆగ్రహంతో ఊగిపోయారు. స్థానిక అధికారుల తీరుకు వ్యతిరేకంగా రైతన్నలు ధర్నాలతో ఆ గ్రామాలు దద్దరిల్లాయి. ప్రతిపాదిన రాజధాని నగరం నిర్మాణం కోసం ప్రభుత్వం చేపడుతున్న భూ సమీకరణకు వ్యతిరేకంగా రైతులు కదం తొక్కుతూనే వున్నారు. అందులో భాగంగా తమ భూములను ఇచ్చేందుకు అభ్యంతరాలను తెలుపుతూ రైతులు ఇస్తున్న అభ్యంతర పత్రాలను అధికారులు తీసుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో మంగళగిరి మండలం నవులూరు, యర్రబాలెం రైతులు 9.2 ఫారాలు ఇచ్చేందుకు స్థానిక సీఆర్‌డీఏ కార్యాలయాలకు వెళ్లారు. అయితే అధికారులు మధ్యాహ్నం వరకు వాటిని తీసుకోలేదు. దీనిపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కార్యాలయాల ఎదుట ధర్నాకు దిగారు. చివరకు సీఆర్‌డీఏ అధికారులు జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లను ఫోన్‌లో సంప్రదించి, వారి నుంచి అనుమతి తీసుకుని అభ్యంతర పత్రాలు తీసుకున్నారు. దీంతో రైతులు శాంతించారు.

.జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : proposed area of the capital  Farmers staged  Objection documents  

Other Articles