Rambati rambabu takes on chandrababu

Ambati Rambabu, ysr congress party leader, Chandrababu, current charges, special status, ysr congress party spokesperson,

ysr congress party spokesperson rambati rambabu takes on chandrababu

అధికారంలోకి రాగానే చంద్రబాబు నైజం బయటపడింది..

Posted: 02/08/2015 08:03 PM IST
Rambati rambabu takes on chandrababu

అధికారంలోకి రాకముందు పైసా విద్యుత్ ఛార్జీలు పెంచనని చెప్పిన చంద్రబాబు... అధికారంలోకి రాగానే మాట మార్చారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు ఆరోపించారు. మాట తప్పడమే ఏపీ సీఎం చంద్రబాబు నైజమని ఆయన విమర్శించారు. ఆదివారం హైదరాబాద్లో అంబటి రాంబాబు మాట్లాడుతూ... విభజన చట్టంలో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ప్రస్తుతం కేంద్రం ఇచ్చిన ఆర్థిక సాయం ఏ మాత్రం సరిపోదన్నారు.

ఎన్నికల సమయంలో రాష్ట్రాన్ని స్వర్ణాంధ్ర చేస్తానని మోదీ, చంద్రబాబులు ఊదరగొట్టారని గుర్తు చేశారు. కాంగ్రెస్ ఐదేళ్లు ప్రత్యేక హోదా అంటే... వెంకయ్యనాయుడు మాత్రం 10 ఏళ్ల ప్రత్యేక హోదా కావాలన్నారని... ఇప్పుడు మాట మారుస్తున్నారన్నారు. కేంద్రం నుంచి రావాల్సిన హామీలపై ఎందుకు నోరుమెదపరని చంద్రబాబును ఈ సందర్బంగా అంబటి ప్రశ్నించారు. చంద్రబాబు గతంలో చేసిన స్కాంలపై బీజేపీ విచారణ చేస్తుందని భయపడుతున్నారేమోనని ఆయన సందేహాం వెలిబుచ్చారు.

ఎన్టీఆర్ తెలుగువారి ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో నిలబెడితే... చంద్రబాబు దెబ్బతీసేందుకు యత్నిస్తున్నారని విమర్శించారు. ఆదాయం పెంచాలని ఉద్యోగులను ఆదేశించడం తగదని అంబటి రాంబాబు అభిప్రాయపడ్డారు. వారే విధంగా ఆదాయం పెంచుతారని చంద్రబాబను నిలదీశారు. పీఆర్సీకి... ఆదాయ పెంపునకు సంబంధం ఏమిటి? వెంటనే పీఆర్సీని ప్రకటించాలని చంద్రబాబును డిమాండ్ చేశారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Ambati Rambabu  Chandrababu  special status  

Other Articles