Manjhi expelled from the party

Manjhi expelled from the party, Manjhi expelled from JD(u), nitish kumar to return as bihar cm, Manjhi appealed to dissolve assembly, manjhi appealed governor KN Tripathi to dissolve assembly, Nitish Kumar, Jitan Ram Manjhi, Dissolution, Bihar CM, bihar assembly polls, Bihar CM, Jitam Ram Manjhi, Narendra Modi, Nitish Kumar, Political Play, Sharad Yadav, janata dal united president

In a dramatic turn of events in Patna on Saturday, the Janata Dal (United) expelled rebel Bihar chief minister Jitan Ram Manjhi from the party

ముఖ్యమంత్రినే ‘పార్టీ’ నుంచి వెలి వేశారు..

Posted: 02/07/2015 08:33 PM IST
Manjhi expelled from the party

బిహార్ ముఖ్యమంత్రి, తిరుగుబాటు నేత జితన్ రామ్ మాంఝీని పార్టీ నుంచి వెలి వేశారు. స్వయంగా ముఖ్యమంత్రిగా వున్న వ్యక్తినే పార్టీ నుంచి వెలివేయడం సంచలనం అయ్యింది. షెడ్యూల్డు కులాలకు చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేశామని చెప్పుకున్న పార్టీ ఏడాది తిరగకముందే అతన్ని పదవి నుంచి దిగిపోమ్మని అదేశాలను జారీ చేయడం.. త్వరలో ఎన్నికలకు వెళ్లనున్న పార్టీకి ఇది మేలు చేస్తుందా..? అన్నది కూడా చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి మాంఝీ తన పదవిని వదులుకునేందుకు సిద్దంగా లేకపోవడంతో స్వయంగా ముఖ్యమంత్రిగా వున్న వ్యక్తిని పార్టీ నుంచి బహిష్కరించారు.

వేగంగా మారుతున్న బీహార్ మైనారిటీ ప్రభుత్వంలోని పరిణామాలను చక్కదిద్దేందుకు మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్, ముఖ్యమంత్రి మాంఝీలు భేటీ అవుతున్నారన్న వార్తలు కూడా వినబడ్డాయి. ఒక దశలో మాంఝీ రాజీనామాకు అంగీకరించారని కూడా వార్తలు వెల్లువెత్తాయి. కాగా పరిణమాలు మళ్లీ వేగంగా మారాయి. మాంఝీ తన పదవిని వదులుకునేందుకు సిద్దంగా లేరు. ఈ నేపథ్యంలోనే మాజీ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ కు అత్యంత సన్నిహితంగా వున్న ఇద్దరు మంత్రులు రాజీవ్ రంజన్, షాహీలను ప్రభుత్వం నుంచి బర్తరఫ్ చేయాలని గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠిని కోరారు. అ మేరకు గవర్నర్ సమ్మతించి వారిని బర్తరఫ్ చేశారు.

అంతే కాదు తనను పదవి నుంచి జేడీ(యు) తొలగిస్తారన్న వార్తల నేపథ్యంలో జితన్ రామ్ మాంఝీ అత్యవరసరంగా మంత్రివర్గ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వాన్ని రద్దు చేద్దామని ప్రతిపాదించారు. అయితే ఇందుకు ఏడుగురు మంత్రులు సమ్మతించారు. కాగా 21 మంది మంత్రులు వ్యతిరేకించారు. దీంతో సమస్య మరింత జఠిలమైంది. చేసేది లేక తన మంత్రి వర్గం నుంచి మరో 19 మంది మంత్రులను బర్తరఫ్ చేయాలని మాంఝీ గవర్నర్ త్రిపాఠిని కోరారు. ఈ నేపథ్యంలో గవర్నర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది వేచి చేడాల్సిందే.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Nitish Kumar  Jitan Ram Manjhi  Dissolution  Bihar CM  

Other Articles