Aap rejects bukhari offer

aap rejects bukhari offer, delhis jama masjidshahi imam bukhari, shahi imam extends support to aap, aap rejects shahi imam offer, aap, aravind kejriwal, aap leader sanjay singh, bukhari, narendra modi, delhi assembly elections 2015, amit shah, kiran bedi, ajay maken, congress party, bjp, sonia gandhi, rahul gandhi, Syed Ahmed Bukhari,

shahi imam of delhis jama masjid bukhari extends support to aap party rejects it

అందరి ఓట్లు కావాలి, కానీ మతాలవారీగా కాదు..

Posted: 02/07/2015 08:00 AM IST
Aap rejects bukhari offer

ఎన్నికలు అంటేనే గెలుపు ఓటములు. అయితే కుల, మతాల వారీగా అందరూ ఓట్లను అగడటం పరిపాటే. ఇందుకు తెరచాటుగా కుల, మత పెద్దలకు తాయిలాలను కూడా ఇస్తామని హామీలు గుప్పిస్తారు. ఓట్లు వేస్తామని చెప్పగానే వారి కావాలిన సరంజామా కూడా అందిస్తారు. ధనం, మద్యం ఇలా అన్ని ఏర్పాటు చేస్తామంటూరు. ఓట్ల కోసమేగా తాము పోటీలో నిల్చున్నదంటూ.. చల్ల కొచ్చి ముంత దాచమెందుకని నిర్మోహమాటంగా చెప్పేస్తుంటారు. కానీ అలాంటి అపర్లు వచ్చినా తనకు వద్దని చెప్పే వారెందరుంటారు. చాలా తక్కువ మందే కదూ. అలాంటి వారిలో ఒకరే అప్ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలలో బీజేపి ప్రదాని అభ్యర్థి నరేంద్ర మోడీకి మద్దతు తెలిపి అతని విజయానికి కారణమైన జామా మసీద్ షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ.. తాజాగా ప్లేటు మార్చారు. బీజేపి మతత్తత్వ పార్టీ అని.. కాబట్టి ముస్లిం అందరూ అప్ కే ఓటు వేయాలని ఆయన పిలుపునిచ్చారు. అయన ఇచ్చిన ఆఫర్ని ఆమ్ ఆద్మీ పార్టీ తిరస్కరించింది. మసీదులో ప్రార్థనలకి వచ్చిన ముస్లింలందరిని ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ  ఒకే పార్టీకి ఓటు వేయాలన్నారు. మతతత్వ పార్టీలకి కాకుండా లౌకిక పార్టీలని గెలిపించాల్సిన అవసరం ఉందని ఆయన అన్నారు.

బీజేపీ దేశాన్ని మతపరంగా విభజించాలని చూస్తుందని ఆయన విమర్శించారు. ముస్లింల అభివృద్ధికి సహకరించే లౌకిక పార్టీ అయిన ఆప్కి ఓటు వేయాలని సూచించారు. కిందటి ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో బుఖారీ ఆప్కి వ్యతిరేకంగా మట్లాడి కాంగ్రెస్ పార్టీకి మద్దతునిచ్చారు. అయితే బుఖారీ భావజాలానికి ఆప్ వ్యతిరేకం అని తమకి ఆయన మద్దతు అవసరం లేదని ఆప్ నేత సంజయ్ సింగ్ స్పష్టం చేశారు. తమకు అందరి ఓట్లు కావాలని అయితే మతాల వారీగా తాము ఓట్లు అడగబోమని ఆయన స్పష్టం చేశారు. పైగా తమకు మద్దతు తెలిపిన బుఖారీపై ఆయన విమర్శలు గుప్పించారు. తన కుమారున్ని జామా మసీదు తదుపరి షాహీ ఇమామ్గా పట్టాభిషేకం చేసే కార్యక్రమానికి భారత ప్రధానిని ఆహ్వానించలేదు. ఈ కార్యక్రమానికి పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ని పిలిచి బుఖారీ తన అసలు రంగు బయట పెట్టుకున్నారని సంజయ్ సింగ్ విమర్శించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shahi imam of Jama Masjid  Syed Ahmed Bukhari  Delhi assembly elections  

Other Articles