Sunitha krishnan car stoned in hyderabad

gang rape, Sunitha Krishna, Prajwala India, gang rape in India, rapes in India, crime, gang rape in Hyderabad, gang rape in WhatsApp Rape videos in WhatsApp.

Social activist Sunitha Krishnan's car stoned over anti- rape campaign

ITEMVIDEOS: నిందితులను పట్టుకోమ్మంటే.. రాళ్లతో దాడి చేశారు..

Posted: 02/06/2015 03:38 PM IST
Sunitha krishnan car stoned in hyderabad

సామాజిక కార్యకర్త, ప్రజ్వల సంస్థ నిర్వాహకురాలు సునీతా కృష్ణన్పై శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తులు దాడికి యత్నించారు. ఆమె కారుపై దుండగులు రాళ్లు రువ్వారు. కారు అద్దాలు ధ్వంసం చేశారు.  హైదరాబాద్ పాతబస్తీలో ఈ సంఘటన జరిగింది. కామాంధుల ఆచూకీని తెలిసిన వారు తనకు ఈ మెయిల్ పంపించాలని, నిందితులకు శిక్ష పడేందుకు సహకరించాలని అభ్యర్థిస్తూ వాట్సఫ్ లో సంచలనం రేపిన గ్యాంగ్ రేప్ నిందితుల వీడియోను పోస్ట్ చేసింది. అయితే వీడియోను పోస్ట్ చేసి 24 గంటలు కూడా తిరగక ముందే. అమెపై దాడి యత్నం జరిగింది. హైదరాబాద్ అంటే ఇంతే.. చాలా ఫాస్ట్ గా రియాక్షన్ వచ్చేస్తుందని దుండగులు ఈ చర్యలకు పాల్పడ్డారు.

వివరాల్లోకి వెళితే.. ఓ అమ్మాయిని అయిదుగురు యువకులు ఎత్తుకెళ్లి అత్యాచారం చేశారు. అన్నా విడిచి పెట్టండని ఆమె వేడుకున్నా అరణ్య రోదనే అయ్యింది. ఆ మృగాలు.. సామూహిక అత్యాచారాన్ని వీడియోలో చిత్రీకరించారు. తాము చేస్తుందేదో ఘనకార్యం అంటూ నవ్వుతూ వీడియోకు ఫోజులు ఇచ్చారు. సుమారు ఆరు నెలల క్రితం ఈ దారుణం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ  వీడియో వాట్సప్‌లో ప్రచారంలో ఉంది. ఆ వీడియో సునీతా కృష్ణన్‌కు కూడా వీడియో చేరింది.  దాంతో ఆ దుర్మార్గులు ఎవరు ? ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకునే పనిలో పడ్డారు.

ఈ రేపిస్టులను గుర్తించండి అంటూ..  సునీతా కృష్ణన్ యూ ట్యూబ్‌లో ఆ వీడియోను నిన్న పోస్ట్‌ చేశారు. ఇలాంటి ఘటనలు జరగకుండా ఉండేందుకు కృషి చేయాలని కోరారు. రేపిస్టులకు తగిన శిక్ష పడేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ దారుణ ఘటనపై యూ ట్యూబ్‌లో పోస్ట్‌ చేసిన వెంటనే....  సునీతా కృష్ణన్‌ వాహనంపై గుర్తు తెలియని దుండగలు దాడి చేశారు. కలకలం రేపిన ఈ ఘటనపై కేంద్ర స్త్రీ, శిశుసంక్షేమ మంత్రిత్వ శాఖ దృష్టి స్పందించింది. బాధ్యులు ఎవరో తెలుసుకునే పనిలో పడింది. సైబర్‌ క్రైం పోలీసుల సహకారంతో ఎక్కడి నుంచి ఈ ఫుటేజ్‌ బయటకు వచ్చిందో విచారణ ప్రారంభించారు.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Gang Rape  WhatsApp  Sunitha Krishna attacked  

Other Articles