Shatrughan sinha praises rival kejriwal

Shatrughan Sinha praises Kejriwal, Aravind Kejriwal, Shatrughan sinha, BJP, AAP, Delhi assembly polls 2015, bjp shot gun, kiran bedi, pm narendra modi, bjp, amit shah,

BJP's Shatrughan Sinha has spoken somewhat off the script and praised his party's number one rival, Arvind Kejriwal, describing him as a "good man."

ఢిల్లీ ఎన్నికలలో సీన్ రివర్స్.. కేజ్రీని పొగిడిన బీజేపి నేత

Posted: 02/06/2015 10:29 AM IST
Shatrughan sinha praises rival kejriwal

ఢిల్లీలో ఒక్కసారిగా సీన్ రివర్స్ అయ్యింది. ఇన్నాళ్లు అమ్ అధ్మీ పార్టీని ఢిపెన్స్ లోకి నెట్టిన కేంద్రంలోని అధికార పార్టీ బీజేపి సెల్ఫ్ గోల్ చేసుకుంది. ఆప్ చెందిన నేతలను తమ పార్టీలోకి ఆహ్వానించి హస్తిన ఎన్నికల బరిలో నిలిపినప్పటికీ బీజేపికి ఆశించిన స్థాయిలో లాభం మాత్రం చేకూరలేదని సర్వేలు స్పష్టం చేస్తున్నాయి. అయితే ఇప్పటికే ఢిల్లీ ప్రజలు అరవింద్ కేజ్రీవాల్ పట్ల మొగ్గుచూపుతున్నారని స్పష్టమైన తరుణంలో బీజేపి నేత, కేంద్ర మాజీ మంత్రి శతృఘ్నన్ సిన్హా కేజ్రీవాల్ ను పోగడ్తలతో ముంచెత్తడం అప్ కు కలసి వచ్చే అంశంగా మారింది.

మరో 24 గంటల లోపు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లనున్న తరుణంలో బాలీవుడ్ షాట్ గన్ గా పేరొందిన బీజేపి నేత శతృఘ్నన్ సిన్హా తనదైన శైలిలో కేజ్రీవాల్ పై తన అభిమానాన్ని చాటుకున్నారు. కేజ్రీవాల్ మంచి వ్యక్తి అంటూ, అమ్ ఆద్మీ పార్టీకి ఢిల్లీ ఎన్నికలలో అవకాశాలు మెరుగవుతున్నాయంటూ చెప్పుకోచ్చారు. ప్రతీ ఒక్కరు అప్ గురించే మాట్లాడుతున్నారన్నారు. మీడియా కూడా వారి గురించే చర్చ జరుగుతుందన్నారు. నాలుగు దశాబ్దాలుగా దేశానికి ఐఎఎస్ అధికారి హోదాలో సేవలందించిన కిరణ్ బేడీతో పోటీ పడుతున్న కేజ్రీవాల్ కూడా నిజాయితి కలిగిన అధికారేనంటూ ఆయన కొనియాడారు.

అంతేకాక బీజేపి సీఎం అభ్యర్థిగా కిరణ్ బేడీ కంటే హర్షవర్థన్ ను ప్రకటించి బరిలోకి దింపి వుంటే బాగుండేదంటూ ఆయన వ్యాఖ్యానించి చివరి నిమిషంలో కలకలం రేపారు. ఇప్పటికే కేజ్రీవాల్ కు తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. అటు సీపీఎం కూడా అమ్ ఆద్మీ పార్టీకి తమ మద్దతును ప్రకటించింది. అప్ పార్టీకే ఒటు వేయాలంటూ తమ పార్టీ కార్యకర్తలకు సూచించింది.

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shatrughan Singh  Delhi elections 2015  AAP  

Other Articles