Srinjoy bose resigns from trinamool congress

Srinjoy Bose resigns from Trinamool Congress, Saradha scam accused srinijoy bose, Trinamool Congress Rajya Sabha MP Srinjoy Bose, Srinjoy Bose resigns from party, Srinjoy resigns from primary membership, saradha scam, mamatha bemerjee, TMC president mamatha benerjee, west bengal chief minister mamatha banerjee

A day after he was released on conditional bail in the Saradha scam case, Trinamool Congress Rajya Sabha MP Srinjoy Bose has resigned from the primary membership of the party

దీదీకి మరో షాక్.. పార్టీకి సృంజయ్ రాజీనామా..

Posted: 02/06/2015 08:18 AM IST
Srinjoy bose resigns from trinamool congress

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి, తృణముల్ కాంగ్రెస్ అధినేత్రి మమతా బెనర్జీ (దీదీ)కి మరో షాక్. తృణముల్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్ గుడ్ బై చెప్పారు. పార్టీకి చెందిన అనే్క మంది ప్రజాప్రతినిదులను శారదా కుంభకోణం అంశం ఇంకా అట్టుడికిస్తూనే ఉంది. సీబీఐ అరెస్టులు, ప్రశ్నల పర్వానికితోడు పార్టీ నేతల రాజీనామాలతో దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఇప్పటికే పలువురు నేతలు టీఎంసీకి టాటా చెప్పగా... తాజాగా శారదా స్కాంలో జైలుకు వెళ్లి, బెయిల్‌పై బయటకు వచ్చిన తృణమూల్ కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు సృంజయ్ బోస్ ఆ పార్టీకి, ఎంపీ పదవికి గురువారం రాజీనామా చేశారు.

శారదా చిట్‌ఫండ్ కుంభకోణం కేసులో 75 రోజులుగా జైల్లో ఉండి విడుదలైన పార్టీ ఎంపీ సృంజయ్‌బోస్ బెయిల్‌పై విడుదలైన మరుసటి రోజునే తృణముల్ కాంగ్రెస్ కు రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. అదే సమయంలో పశ్చిమ బెంగాల్ మహిళా కమిషన్ సభ్యురాలు, సినీ నటి లోకేత్ చటర్జీ గురువారం తృణమూల్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసి.. బీజేపీలో చేరారు.
 
మరోవైపు శారదా చిట్‌ఫండ్ కుంభకోణంపై సీబీఐ చేస్తున్న దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించాలన్న పశ్చిమబెంగాల్ ప్రభుత్వ విజ్ఞప్తిని సర్వోన్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. దీనికి సంబంధించి సీబీఐ ఎలాంటి నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నట్లుగానీ బెంగాల్ ప్రభుత్వం పేర్కొనలేదని జస్టిస్ టీఎస్ ఠాకూర్, జస్టిస్ సి.నాగప్పన్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది.

జి మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Trinamool Congress  Srinjoy Bose  Saradha chitfund scam  Mamata Banerjee  

Other Articles