Gold pieces found on nalgonda road

gold pieces found on road, nalgondites busy in collecting gold pieces, gold pieces on nalgonda roads, miryalaguda, thipparthy, vemulapally, some mandals of nalgonda, brass pieces, gold pieces

miryalaguda, thipparthy, vemulapally and in some mandals of nalgonda people who collected gold pieces were in shock after knowing that is brass

రోడ్డుపై బంగారు ముక్కలు.. సేకరణకు పోటీపడ్డ గ్రామస్థులు

Posted: 02/06/2015 08:13 AM IST
Gold pieces found on nalgonda road

ఈ దెబ్బతో తమకున్న ధారిద్ర్యం మొత్తం తీరిపోతుందని ఆశపడ్డారు అక్కడి వారు. ఎప్పుడూ లేనిది ఇవాళ తమ కోసమే పసిడి ముక్కలు లభ్యమయ్యాయని సంతోషపడ్డారు. కర్నూలు, అనంతపురం జిల్లాల్లో వర్షం పడితే చాలు వజ్రాలు లభ్యమవుతాయని గ్రామస్థులు ఇళ్లను వదిలి మరీ వజ్రాల అన్వేషణలో అడవుల్లో సంచరిస్తుంటారు. అలానే తమకు అదృష్టం కలసివచ్చి బంగారం ముక్కలు లభ్యమయ్యాయని వారు సంబంర పడ్డారు.

నల్లగొండ జిల్లా మిర్యాలగూడ, వేములపల్లి, తిప్పర్తి మండలాల పరిధిలోని నార్కట్‌పల్లి- అద్దంకి రహదారిపై పలువురు వాహనదారులు, స్థానికులు బంగారు పూత పూసిన ముక్కలను సేకరిస్తూ ఇలా కనిపించారు. తమకు దొరికిందంతా బంగారమే అనుకుని పోటీపడిన గ్రామస్థులు పసిడి సేకరణలో బిజీగా మారారు. ఆ ముక్కలను కొందరు స్థానిక బంగారు నగల తయారీదారుడి వద్దకు తీసుకెళ్లారు.

తమ గ్రామంలోని రో్డలపై ఇలాంటి పసిడి ముక్కలు అనేకం లభించాయని, వాటిలో తరుగు తీసేసి బంగారం శాతం మెంతో.. తమకెంత లభిస్తుందో చెప్పాలని కొరారు.  వాటిని పరీక్షించిన సదరు దుకాణదారుడు గ్రామస్థులకు అసలు విషయం చెప్పారు. వారికి లభించింది బంగారం కాదు.. ఇత్తడి ముక్కలని సెలవీయడంతో గ్రామస్థులు అవాక్కయ్యారు. ఆ ముక్కలు ఇళ్ల ఫ్లోరింగ్‌లో మెరుపు కోసం వాడతారని తెలియడంతో పెదవి విరుచుకుంటూ ఎవరిదారిన వారు వెళ్లిపోయారు. 

 

జి.మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : gold  brass  glitters  nalgonda  

Other Articles