Rahul gandhi jayanti natarajan controversial comments delhi assembly elections

rahul gandhi, rahul gandhi press meet, rahul gandhi controversies, rahul gandhi latest news, rahul gandhi jayanti natarajan news, jayanti natarajan news, jayanti natarajan controversy, jayanti natarajan cmments, sonia gandhi news, sonia gandhi controversy, congress ministers, congress leaders, delhi assembly elections

rahul gandhi jayanti natarajan controversial comments delhi assembly elections : Congress Party Vice President rahul gandhi has given replied to jayanti natarajan comments that.. He will never fear with others allegations

‘‘చెట్టుకింద దెయ్యం.. నాకేం భయం’’!

Posted: 02/04/2015 04:23 PM IST
Rahul gandhi jayanti natarajan controversial comments delhi assembly elections

కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు అయిన రాహుల్ గాంధీ వ్యవహారశైలి ఎప్పుడెలా వుంటుందో ఎవ్వరికీ అర్థం కాదు! సందర్భాన్ని బట్టి సరిగ్గా మాట్లాడలేకపోవడం, సమయానికనుగుణంగా నడుచుకోకపోవడం లాంటి లోపాలు ఈ నాయకుడిలో స్పష్టంగా కనిపిస్తాయని రాజకీయ విశ్లేషకులు ఎప్పుడో విమర్శించారు కూడా! అదికూడా మరెవ్వరో కాదు.. సొంత పార్టీలో మినిస్టర్లుగా, నాయకులుగా వైదొలుగుతున్న నాయకులే ఆయనపై తీవ్ర విమర్శనాస్త్రాలు సంధించారు. రాహుల్ గాంధీ వల్లే కాంగ్రెస్ సార్వత్రిక ఎన్నికల్లో ఘోరంగా ఓడిందని, అతని స్థానంలో ప్రియాంకను తీసుకోవాలంటూ ఎంతోమంది సోనియాగాంధీకి సలహాలు ఇచ్చారు కూడా! అయినా రాహుల్ మాత్రం తన స్వభాగం మార్చుకోకుండా ‘‘‘చెట్టుకింద దెయ్యం.. నాకేం భయం’’ అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని సమాచారం!

ఇటీవలే కాంగ్రెస్’కు రాజీనామా చేసిన సీనియర్ నాయకురాలు జయంతి నటరాజన్... ఆ పార్టీని వీడుతూ రాహుల్ గాంధీపై ప్రత్యక్షంగా నిప్పులు చెరిగిన విషయం తెలిసిందే! పర్యావరణ శాఖమంత్రిగా తాను వున్నప్పుడు రాహుల్ కొన్ని విషయాల్లో జోక్యం చేసుకున్నారని, తనను శాఖ నుంచి తొలగించేముందుకు ఒక్కమాట కూడా చెప్పలేదని ఆమె ఆరోపించింది. అతని వల్లే తాను పార్టీ వీడాల్సి వస్తోందని, సీనియర్ నాయకురాలైన తనకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. రాహుల్ తనను పార్టీ నుంచి తొలగించేందుకు ఎప్పటినుంచో కుట్రలు పన్నుతున్నారని ఆమె మీడియా సమావేశంలో ఆరోపణలు చేసింది. ఇదే విషయమై సోనియాకు లేఖ రాసిన విషయం విదితమే! ఏదైతేనేం.. రాహుల్’ని ఆమె కడిగిపారేశారు. అయితే.. ఆమె చేసిన వ్యాఖ్యానాలకు ఇప్పటివరకు నోరు మెదపని రాహుల్.. తాజాగా స్పందించారు.

ఆనాడు జయంతి చేసిన వ్యాఖ్యలకు తాను ఏమాత్రం భయపడటం లేదని రాహుల్ ఖరాఖండిగా తేల్చి చెప్పాడు. తాను కేవలం పేదప్రజల కోసమే వున్నానని, పారిశ్రామికవేత్తల కోసంద కాదని వెల్లడించాడు. అంటే.. కాంగ్రెస్ పార్టీ వుండేది కేవలం ప్రజలకు సేవ చేయడం కోసం మాత్రమేనని.. పారిశ్రామికులుగా కొనసాగుతున్నవారికి తమ పార్టీ నిలయం కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఓవైపు పార్టీ నాయకులు వరుసగా విమర్శలు చేస్తున్నా... రాహుల్ మాత్రం తన వైఖరి మార్చుకోకుండా మొండివైఖరి ప్రదర్శిండంపై కొందరు ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్నాళ్లు ఇలాగే కొనసాగితే.. పార్టీలో వున్న నాయకులు వేరే పార్టీల్లో వలసలకు వెళ్లి.. కాంగ్రెస్ అడ్రస్ లేకుండా పోతుందని అంటున్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : rahul gandhi latest updates  jayanti natarajan controversy  sonia gandhi  

Other Articles