Saba was kidnapped and killed by constable couple

saba girl news, shahasta saba news, shahasta saba death, police constable jakir hussain, jakir hussain wife rajiya sultana, police couple jakir rajiya sultana

saba was kidnapped and killed by constable couple : The story of 5 years old girl who killed by police constable family members.

ఖాకీ క్రూరత్వం.. 5ఏళ్ల పాపను కిడ్నాప్ చేసి చిత్రహింసలు పెట్టి చంపేశారు!

Posted: 02/04/2015 01:48 PM IST
Saba was kidnapped and killed by constable couple

సంగారెడ్డిలో ఓ ఖాకీ కుటుంబం సబ అనే ఐదేళ్ల చిన్నారిని అత్యంత క్రూరంగా చిత్రహింసలు పెట్టి, చంపేసిన విషయం తెలిసిందే! మొదట్లో ఆ అమ్మాయి తమ కూతురేనంటూ తప్పుడు సమాచారమిచ్చిన ఆ క్రూర ఖాకీ దంపతలు అసలు బాగోతాన్ని పోలీసులు సేకరించారు. ఎక్కడో జాతరలో ఆడుకుంటున్న ఈ చిన్నారిని దొంగతనంగా ఎత్తుకొచ్చి.. తమ పైశాచికత్వాన్ని ఆ అమ్మాయి చూపించి దారుణంగా హత్య చేశారు. పాప తలను బలంగా గోడకేసి కొట్టడంతో పుర్రె అంతర్భాగం చితికిపోయి, మెదడుకు ఇన్ఫెక్షన్ సోకడంతో ఆ అమ్మాయి చనిపోయినట్లు వైద్యపరీక్షల్లో తేలింది. ఈ చిన్నారి చనిపోయినట్లు వచ్చిన వార్తలను చూసి హైదరాబాద్’కు ఆమె తల్లిదండ్రులు సంగారెడ్డికి చేరుకుని, తమ పాప విషయం చెప్పి భోరున విలపించారు.

హైదరాబాద్’లోని రాజేంద్ర నగర్ ప్రాంతంలోని హసన్ నగర్’కు చెందిన మహ్మద్ మహబూబ్, రేష్మాబేగం దంపతుల మూడో కుమార్తె ఈ సబ. ఈ చిన్నారి అసలు పేరు నౌసిన్ బేగం (5ఏళ్లు). గతేడాది రంజాన్ పండుగ సందర్భంగా ఈ కుటుంబసభ్యులు కర్ణాటక రాష్ట్రంలోని గుల్బర్గలోని కేబీఎన్ దర్గాలో జరిగే ఉర్సుకు వెళ్లారు. అదే సమయంలో హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ జాకీర్ హుస్సేన్ కూడా తన భార్య, ఆరుగురు సంతానంతో కలిసి అదే దర్గాకు వెళ్లారు. (ఇతను జూలై 29వ తేదీ నుంచి ఆగస్టు 1 వరకు సెలవు తీసుకున్నట్లు పోలీస్ రికార్డుల్లో కూడా నమోదువుంది). ఇక జాతర నుంచి ఇంటికి తిరిగి వస్తున్న క్రమంలో ఈ ఖాకీ కుటుంబానికి ఆ జాతరలో ఒంటరిగా ఆడుకుంటున్న నౌసిన్ బేగం కనిపించింది. ఇప్పటికే ఆరుమంతి సంతానంతో వేగలేకపోతున్న ఆ ఖాకీ భార్య రజియా సుల్తానా పనిమనిషి కోసం వెతుకుతోంది. అయితే అదే సమయంలో అమ్మాయి కనిపించడంతో అదే అదునుగా భావించి ఆమెను కిడ్నాప్ చేసి, కొండాపూర్ మండలం మల్కాపూర్’లోని తమ ఇంటికి తెచ్చుకున్నారు.

అదే సమయంలో జాతరలో కనిపించకుండా పోయిన తమ కూతురి కోసం మహబూబ్, రేష్మాబేగం దర్గా పరిసర ప్రాంతాల్లో వెతికారు. అయితే పాప కనిపించకపోయేసరికి పోలీస్ స్టేషన్’లో ఫిర్యాదు చేశారు. రెండ్రోజుల తర్వాత కిడ్నాప్ కేసుగా నమోదు చేసిన పోలీసులు.. ఆ తర్వాత గాలింపు చర్యలు చేపట్టకుండా ఊరికే వుండిపోయారు. ఇక తమ కూతురు దొరకడం కష్టమేనని భావించిన ఆ చిన్నారి తల్లిదండ్రులు కూడా అంతగా పట్టించుకోలేదు.

ఇక ఆగస్టు 2వ తేదీన పోలీస్ స్టేషన్ విధులకు హాజరైన జాకీర్ హుస్సేన్.. తర్వాతకాలంలో పనికోసం ఒక చిన్నపాపను తమ ఇంటికి తెచ్చుకున్నట్లుగా సహచర పోలీస్ మిత్రులకు చెప్పినట్లు కొందరు పేర్కొన్నారు. అలాగే తన భార్య గయ్యాళిదని జాకీర్ పలుమార్లు స్టేషన్’లోనే చెప్పినట్లు, ఎస్ఐతో సహా అందరికి తెలుసునన్నట్లుగా పోలీసులు చెప్తున్నారు. మరోవైపు తమ ఇంటికి తెచ్చుకున్న పాపను ఖాకీ కుటుంబసభ్యులు రోజూ చిత్రహింసలు పెట్టేవారు. పనిచేయకపోతే సూదులతో వాతలు పెట్టేవారు. సరిగ్గా తిండి కూడా పెట్టేవాళ్లు కాదు. తన తలిదండ్రులను గుర్తు చేసుకుంటూ ఆ పాప ఏడ్చుకుంటూనే రాత్రంతా మేలుకుని వుండేది. తనకు ఆకలిగా వుందని ఎంతగా వేడుకున్నప్పటికీ.. వాళ్లు పెట్టకపోగా కొట్టేవాళ్లు. కోపం వచ్చినప్పుడల్లా ఆ చిన్నారిని చితకబాదేవారు.  

ఈ చిన్నారిని ఈ విధంగా చిత్రహింసలకు గురిచేస్తున్నారని స్టేషన్ హౌస్ అధికారికి తెలిసినా ఆయన కూడా హెడ్‌కానిస్టేబుల్‌తో ఉన్న సాన్నిహిత్యంతో చెప్పలేకపోయారనే విమర్శలు వస్తున్నాయి. అయితే పాప పడువుతున్న చిత్రవధను చూడలేకపోయిన స్థానికులు చివరకు చైల్డ్‌లైన్ డెరైక్టర్‌కు చేరవేశారు. దాంతో స్పందించిన ఆయన.. చైల్డ్‌లైన్ డెరైక్టర్ గత నెల 27న ఒక టీవీ ఛానల్ రిపోర్టర్‌కు ఫోన్ చేసి సంయుక్త ఆపరేషన్ చేద్దామని అడిగినట్లు సమాచారం.అదే రోజు రాత్రి బాగా పొద్దుపోయాక ఆయన జిల్లా పోలీసులకు కూడా సమాచారం చేరవేసినట్లు తొలుత చైల్డ్‌లైన్ డెరైక్టరే మీడియాకు చెప్పారు. కానీ.. వారినుంచి స్పందన అంతగా లేకపోవడం వల్ల త్వరితగా యాక్షన్ తీసుకోలేదు. చివరకు అనంతరం జిల్లా ఎస్పీ సుమతి ఓ తల్లిగా స్పందించడంతో పోలీసు దాడులు  మొదలయ్యాయి. డీఎస్పీ తిరుపతన్న మెరుపు దాడి చేశారు కానీ. అప్పటికే చిట్టితల్లి కర్కశుల చేతిలో గాయపడి కొన ఊపిరితో చివరి ఘడియల్లో ఉంది. వెంటనే 108లో ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకపోయింది.

రాత్రింబవళ్లు వాళ్లు పెట్టిన ఆ ఆవేదనలు వర్ణనాతీతం. ఆ చిన్నారి ఆ ఖాకీ కుటుంబసభ్యుల చేతిలో ఎంత దారుణంగా హింసించబడిందో చెప్పుకుంటే కంటతడి ఆగదు.. మనస్సు చలించిపోతుంది.. బాధతో ఏడ్వాలనిపిస్తుంది. ఈ చిన్నారి అనుభవించిన రోదన అంతాఇంతా కాదు. పక్కింట్లో వున్నవాళ్లకు సైతం ఈమె అరుపులు, ఏడుపులు వినిపించినప్పటికీ.. వాళ్లు పోలీసువారు కావడంతో ఏమీ చెప్పలేకపోయారు. పోలీసులమన్నా అహంకారంతో వాళ్లు ఈ చిన్నారిపై రోజురోజుకూ విషం కక్కుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ఆ చిన్నారిని గోడకు బలంగా కొట్టడంతో పుర్రె అంతర్భాగం చితికిపోయి, మెదడుకు ఇన్ఫెక్షన్ సోకడంతో మరణించిందని వైద్యులు నిర్ధారించారు.

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles