Barack obama interview india new delhi america wahington relationship china president comments

US, USA, United States of America, China, India, President, Barrack Obama, Obama, Narendra Modi, Modi, Beijing, New Delhi, Washington, narendra modi obama, obama modi news, china president jinping

US President Barrack Obama assured that the healthy relationship between New Delhi and Washington has nothing to do badly with Beijing. He was surprised at the Chinese overreaction. "I was surprised when I heard that the Chinese government had put out these statements. China doesn't need to be threatened because we have good relations with India," Mr Obama said to the media.

ఇండియాతో వున్న సంబంధంపై చైనాకు హామీ ఇచ్చిన ఒబామా!

Posted: 02/02/2015 01:22 PM IST
Barack obama interview india new delhi america wahington relationship china president comments

గణతంత్ర వేడుకల సందర్భంగా ఒబామా దంపతులు ముఖ్యఅతిథులుగా భారత్’కు వచ్చేసిన సంగతి తెలిసిందే! ఆ సమయంలో మోడీ-ఒబామా కొన్ని కీలక ఒప్పందాలు కుదుర్చుకోవడం జరిగింది. దేశాభివృద్ధికి అనుగుణంగా సత్సంబంధాలు ఏర్పరుచుకుంటే మంచిదన్న భావనతో ఇద్దరూ చేతులు కలిపారు. అయితే.. ఈ ఒప్పందంపై చైనా కొన్ని విమర్శలు గుప్పించింది. అమెరికాని నమ్మొద్దంటూ చైనా అధ్యక్షుడు భారత్’కు సలహా ఇచ్చారు. అలాగే.. ఈ రెండు దేశాల సంబంధం తమకు ఎక్కడా ముప్పు తెచ్చిపెడుతుందోనన్న భయాన్ని చైనా వ్యక్తం చేసింది కూడా!

ఆ సమయంలో చైనా చేసిన వ్యాఖ్యాలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు ఒబామా స్పందించారు. కొన్ని విశ్వసనీయ అంశాలే తమను భారత్’కు దగ్గరకు చేశాయని పేర్కొన్న ఒబామా.. భారత్-అమెరికా సంబంధంపై చైనా అంతగా భయపడాల్సిన అవసరం లేదని అన్నారు. తమ మధ్య జరిగే ఒప్పందాలు ఇతర దేశాలకు ముప్పు కలిగించేలా వుండవని అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేశారు. న్యూఢిల్లీకి, వాషింగ్టన్’కు మంచి సంబంధాలున్నాయని ఆయన పేర్కొన్నారు.

ఓ అంతర్జీతయ ఆంగ్ల ఛానెల్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఒబామా తన మూడురోజుల పర్యటన గురించి వివరించారు. ఈ నేపథ్యంలోనే చైనా చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ‘‘చైనా అటువంటి ప్రకటనలు చేయడం నిజంగా ఆశ్చర్యకరంగా వుంది. విలువలు ప్రతిబింబించే భారత్ ప్రజాస్వామ్యమే మా సంబంధాలకు పునాది. అందుకే వారితో ఏదో సంబంధం వుందని నేను, అమెరికా ప్రజలు భావిస్తారు. మా మధ్య వున్న సంబంధంపై చైనాకు భయపడాల్సిన అవసరం లేదు’’ అని స్పష్టం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : barack obama  narendra modi  china president  republic day festivals  

Other Articles