Businessman family goes missing leaving sucide note

businessman family goes missing, vanasthalipuram business man family, businessman family leaves sucide note, sucide note states they are going to commit sucide, business man family sucide, vanasthalipuram business man, family sucide, financial problems, business man financial problems

vanasthalipuram business man family goes missing after writing a sucide note stating that they are going to commit sucide due to financial problems

ITEMVIDEOS: మేం అత్మహత్య చేసుకుంటున్నాం..

Posted: 01/31/2015 09:11 PM IST
Businessman family goes missing leaving sucide note


 హైదరాబాద్‌ వనస్థలిపురంలో ఓ వ్యాపారి వదిలిన లేఖ కలకలం రేపుతోంది. వ్యాపారి కుటుంబ సమేతంగా అదృశ్యమైయ్యాడు. ఎన్జీవో కాలనీకి చెందిన సుబ్బరావు అనే వ్యాపారి తన భార్య, ఇద్దరు పిల్లలతో సహా కనిపించకుండా పోయాడు. తాను, తన కుటుంబం ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తన సోదరునికి సూసైడ్‌ నోట్‌ రాసి వెళ్లడంతో వనస్థలిపురంలో కలకలం రుగుతోంది. కొన్నేళ్ల క్రిందట ఓ కుటుంబం సామూహికంగా ఆత్మహత్యలకు పాల్పడిన ఘటనను ఇప్పుడిప్పుడే మర్చిపోతున్న వనస్థలిపురంలో వ్యాపారి కుటుంబ సమేతంగా అదృశ్యం కావడం కలకలం రేపుతోంది.

ఆర్థిక ఇబ్బందులు తాళలేకే సముద్రంలో దూకి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్‌లో రాశాడు. అదృశ్యమైనవారిలో సుబ్బారావు, ఆయన భార్య గిరిజ, కుమారుడు త్రివిక్రమ్, కూతురు సన్నిహిత ఉన్నారు. సుబ్బరావు సోదరుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. సెల్‌ఫోన్‌ నెంబర్ ఆధారంగా కేసు ఛేదించేందుకు సైబరాబాద్ పోలీసులు ప్రయత్నిస్తున్నారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : businessman missing  suicide note  financial doldrums  

Other Articles