Another actor held on drug charge in kochi

malayalam hero Shine Tom Chacko arrested, Malayalam actor and four women were arrested, celebrities arrested, malayalam actor arrested, assistant director Blessy arrested, model reshma arrested, another two models arrested, model reshma flat raided, cocaine found in reshmas flat, Shine Tom Chacko movies, Shine Tom Chacko photos, Shine Tom Chacko collections, Kerala police, narcotics & drug trafficking, celebrity

A Malayalam actor and four women were arrested in Kochi for allegedly possessing narcotics, police said on Saturday.

మాదకద్రవ్యాలతో పట్టుబడ్డ మరో నటుడు..

Posted: 01/31/2015 08:07 PM IST
Another actor held on drug charge in kochi

మాదకద్రవ్యాలు కలిగివున్న మరో హీరో అడ్డంగా పోలీసులకు దోరికిపోయాడు. కొచ్చిలోని కడవంతర పట్టణంలో గల రేష్మా అనే మోడల్ అద్దె ఇంట్లో కొకైన్ను సేవిస్తూ పట్టబడ్డాడు. వివరాల్లోకి వెళ్తే.. అసిస్టెంట్ డైరెక్టరగా తన కెరీర్ ను ప్రారంభించి.. వివరకు హీరోగా సెటిల్ అవుతున్న మలయాళ చిత్రసీమకు చెందిన హీరో షినే టామ్ చాకో కోచ్చిలోని కడవంతరలో కోకైన్ సేవిస్తూ పోలీసులకు రెడ్ హ్యాండెండ్ గా దోరికిపోయాడు. చిన్న చిన్న పాత్రలలో నటించి మంచి బ్రేక్ ఇవ్వనున్న తాజా చిత్రం 'ఇతీహాస' ముఖ్యపాత్రలో నటించాడు. పక్కా సమాచారం అందుకున్న పోలీసులు రేష్మా ఇంటిపై రైడ్ చేయగా ఫ్లాట్ లో కోకైన్ సేవిస్తున్న హీరోతో పాటు నలుగురు మహిళలని అదుపులోకి తీసుకున్నారు.

వీరి వద్ద నుంచి పది గ్రాముల కోకైన్ ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, దాని విలువ అంతర్జాతీయ మార్కెట్ లో దాదాపు రూ.10 లక్షల వరకు ఉంటుందని తెలిపారు. గోవా నుంచి కోకైన్ ను తీసుకువచ్చినట్లు నిందితులు పోలీసులకు తెలిపారు. శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వీరిని అరెస్ట్ చేసిన పోలీసులు తాజాగా ఇవాళ ఐదుగురి నుంచి వేర్వేరుగా వాంగ్మూలం తీసుకున్నారు. నిందితులని పోలీసులు విచారించిన తర్వాత కోర్టు ముందు హాజరుపర్చనున్నామని కోచ్చి పోలీస్ కమీసనర్ కే. జీ జేమ్స్ మీడియాకు తెలిపారు. నిందితులందరిపైనా నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకో ట్రాఫిక్ సబ్ స్టెన్స్ చట్టం కింది కేసు నమోదు చేసినట్లు తెలిపారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : Shine Tom Chacko  narcotics  kerala police  

Other Articles