Aap promises full statehood for delhi

AAP promises full statehood for Delhi,. aam admi party, aap manifesto, aap manifesto highlights, aap manifesto in hindi, arvind kejriwal, aap latest news, AAP promises Delhi development, bjp manifesto, congress manifesto, manifesto is holybook says aap, latest news on aap manifesto, aap photos, aap latest news, aap 70-point programme, aap promises Delhiites cheap electricity, aap promises free Wi-Fi, aap to impliment women's security force.

The Aam Aadmi Party (AAP) on Saturday released its manifesto for the Feb 7 Delhi assembly elections, focusing on full statehood, women's safety and reducing electricity tariff.

అదే తమ పార్టీ నేతలకు పవిత్ర గ్రంధమట..

Posted: 01/31/2015 03:18 PM IST
Aap promises full statehood for delhi


ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నువ్వా నేనా అన్నట్టుగా పోటీ పడుతున్న ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపిలు మానిషెస్టో విడుదలలోనూ పోటీని ప్రదర్శించాయి. ముందుగా ఎవరు ఎన్నికల ప్రణాళిను విడుదల చేస్తార్న అంశంపై కూడా ఫోటీ పడిన పార్టీలు.. వారి దాంట్లో లేని అంశాలను పోందుపర్చి సాధ్యసాధ్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఎత్తుగడ వేశాయి. ఈ క్రమంలో ఇవాళ ముందుగా ఆమ్ ఆద్మీ పార్టీ తమ ఎన్నికల మానిఫెస్టోను విడుదల చేసింది. పార్టీ ఢిల్లీ వాసులకు గతంలో ఇవ్వని పూర్తి రాష్ట్ర హోదాను సాధిస్తామన్న హామిని ఈ దఫా పోందుపర్చింది.

ఇవాళ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమ్ ఆద్మీ పార్టీ అధ్యక్షుడు అరవింద్ కేజ్రీవాల్ పార్టీ మానిఫెస్టోను విడుదల చేశారు. ఢిల్లీ సమగ్ర అభివృద్ది కోసం తాము కట్టుబడి వున్నట్లు ప్రకటించారు. 70 పాయింట్ల కార్యక్రమంలో భాగంగా.. ఢిల్లీలోకి రాష్ట్ర హోదా, ఢిల్లీలో మహిళల రక్షణకు ప్రత్యేక చర్యలు, సిసిటీవీల ఏర్పాటు, నాణ్యమైన విద్యుత్, ఉతిత వైఫై సేవలు,  తాగు నీరు, 20 నూతన కాళాశాలలు, విద్యుత్ చార్జీల తగ్గింపు తదితర అంశాలను పోందుపర్చారు.

ఢిల్లీ సమగ్రాభివృద్దికి తమ పార్టీ కట్టుబడి వున్నట్లు ప్రకటించారు. దేశ ప్రజలకు దిశానిర్ధేశం చేసేలా తమ పార్టీ ఎన్నికల ప్రణాళిక రూపోందించినట్లు వెల్లడించారు. బీజేపి ఎన్నికల్లో హామీలిచ్చేందుకు భయపడతోందన్న కేజ్రీవాల్ దుయ్యబట్టారు. వారు ప్రణాళికను రూపోందించే పనిలోనే ఇంకా నిమగ్నమయ్యారని తెలిపారు. కాగా తాము అధికారంలో కొనసాగిన పక్షం రోజుల పాలనే తమ పరిపాలనా దక్ష్యతకు నిదర్శనమని చెప్పుకోచ్చారు. తాము ఇతర పార్టీల మాదిరిగా హామీలను మర్చిపోమని చెప్పిన కేజ్రీ.. తమకు, తమ పార్టీ ప్రజాప్రతినిధులకు ఎన్నికల మానిఫెస్టో నే.. పవిత్ర గ్రంధమని కేజ్రీవాల్ చెప్పుకోచ్చారు.

జి. మనోహర్

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : AAP manifesto  delhi elections 2015  aravind kejriwal  

Other Articles