Mahendar singh dhoni virat kohli batting order tri series cricket management

mahendar singh dhoni, virat kohli, india cricket team, dhoni virat kohli, mahendar singh dhoni latest news, dhoni latest news, dhoni photos, virat kohli news, dhoni kohli war, dhoni kohli suggestions, dholi kohli match

mahendar singh dhoni virat kohli batting order tri series cricket management : mahendra singh dhoni given clarification to virat kohli about batting changing order.

కోహ్లీకి ధోనీ సూచన : నచ్చినట్లు వ్యవహరిస్తే.. మంచిది కాదు!

Posted: 01/30/2015 11:56 AM IST
Mahendar singh dhoni virat kohli batting order tri series cricket management

ప్రస్తుత టీమిండియాలో అనుకోని పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న భారత్ జట్టు.. నేడు నవ్వులపాలైపోతోంది. గతంలో అద్బుతంగా తమ ఆటతీరుతో జట్టును గెలిపించిన కొందరు ఆటగాళ్లు ఇప్పుడు పేలవ పెర్ఫార్మెన్స్’తో చతికిలపడిపోతున్నారు. నిన్నటివరకు సన్నిహితంగా మెలిగిన ఆటగాళ్లు.. ఇప్పుడు ఒకర్నొకరిపై విమర్శించుకుంటున్నారు. ఇక జట్టులో వున్న ఇతర ఆటగాళ్లకు ఆదర్శంగా నిలిచిన కెప్టెన్ ధోనీ, కోహ్లీల మధ్యే విభేదాలొచ్చాయని వార్తలొస్తున్నాయి. జట్టులో కీలకపాత్ర పోషించే ఈ ఇద్దరి ఆటగాళ్ల మధ్య ఓ సందర్భంలో వాదించుకోవాల్సి వచ్చిందని చెబుతున్నారు.

ముక్కోణపు సిరీస్’లో భాగంగా ఇండియా జట్టు ఘోరంగా విఫలమవుతున్న విషయం తెలిసిందే! అందులోనూ జట్టుకు వెన్నముకగా పేరొందిన కోహ్లీ అత్యంత దారుణంగా ప్రదర్శించడంతో విమర్శలు తలెత్తుతున్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ సిరీస్’లో అద్భుతంగా రాణించిన కోహ్లీ.. ఇప్పుడు ఈ వన్డే సిరీస్’లో మూడు మ్యాచులకు కేవలం 16 పరుగులు మాత్రమే చేయగలిగాడు. అయితే.. కోహ్లీ ఈ విధంగా దారుణంగా విఫలం అవడానికి కారణం ధోనీయేనంటూ కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే.. ఈ వన్డే సిరీస్’లో ఒక్కొక్క మ్యాచ్’కు కోహ్లీ బ్యాటింగ్ పొజిషన్’ను ధోనీ మారుస్తూ వస్తున్నాడు. అలా మార్చడం వల్ల కోహ్లీ ఆటపై దృష్టి సారించలేకపోతున్నాడని అందరి అభిప్రాయం!

అయితే ఇదే విషయమై ధోనీ, కోహ్లీకి తనదైన రీతిలో సూచించినట్లు సమాచారం! జట్టు ప్రయోజనాల కోసం ఆటగాడు కొన్నిసార్లు త్యాగాలు చేయాల్సి వుంటుందని పేర్కొన్న ధోనీ.. ప్రతి మ్యాచ్’లోనూ ఎప్పుడూ ఒకే స్థానంలో బ్యాటింగ్ చేయాలనుకోవడం సరికాదని కోహ్లీకి సూచించాడు. ‘‘తుది జట్టులో వుండే 11 మందిలో ఎవరు, ఎక్కడ ఆడినా.. జట్టుకు లాభం కలగడం ముఖ్యం. అందువల్ల తనకు నచ్చిన స్థానంలో ఆడుతున్న ఆటగాడు ఒక్కోసారి త్యాగం చేయాల్సి వస్తుంది. అప్పుడు జట్టులో మార్పు, ఫలితాన్ని గ్రహించగలం’’ అని కోహ్లీకి ధోనీ వివరణ ఇచ్చాడని తెలుస్తోంది. దీనికి కోహ్లీ కూడా సమ్మతం తెలిపినట్లు వర్గాలు తెలుపుతున్నాయి.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : mahendar singh dhoni  virat kohli  

Other Articles