Air asia flight qz8501 crashed co pilot indonesian national transportation safety committee report

air asia qz8501 flight crashed, air asia qz 8501, indonesia report, air asia doomed plane, air asia qz8501 co pilot, indonesia investigation plane crashed, air asia plane crashed, indonesia transportation safety committee

air asia flight qz8501 crashed co-pilot Indonesian National Transportation Safety Committee report : Doomed plane was being flown by first officer and NOT captain when it crashed

కో-పైలట్ వల్లే ఎయిర్ ఏషియా విమానం కుప్పకూలిందా!

Posted: 01/29/2015 05:04 PM IST
Air asia flight qz8501 crashed co pilot indonesian national transportation safety committee report

గత డిసెంబర్ 28వ తేదీన ఎయిర్ ఏషియాకు చెందిన క్యూజెడ్ 8501 విమానం ఇండోనేషినయాలోని జావా సముద్రలో పడి కుప్పకూలిపోయిన సంగతి విదితమే! ఈ ప్రమాదంలో మొత్తం 162 మంది మరణించగా.. ఇప్పటివరకు కేవలం 70 మంది మృతదేహాలు మాత్రమే లభ్యమయ్యాయి. అయితే.. ఈ ప్రమాదం జరగడానికి గల కారణాలేమిటో తెలుసుకునేందుకు దర్యాప్తు చేపట్టి ఇండోనేషియా జాతీయ రవాణా భద్రతా కమిటీ.. తన ప్రాథమిక నివేదికలో కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించింది.

ఈ ప్రమాదం జరిగిన సమయంలో విమానాన్ని కెప్టెన్ పైలట్ కాకుండా అంతగా అనుభవంలేని కో-పైలట్ నడుపుతున్నాడని తెలిపిన ఆ కమిటీ.. అతను చేసిన చిన్నపాటి తప్పిదాలు ఇంతటి ఘోరానికి దారితీసిందని నివేదికలో పేర్కొంది. ఇదే విషయమై కమిటీలోని దర్యాప్తు అధికారిగా వున్న సీనియర్ పైలెట్ ఎర్తాట లానంగ్ మాట్లాడుతూ.. ప్రమాదం జరిగిన సమయంలో గగనతలంలో 32వేల ఎత్తులో ఎగురుతున్న విమానం హఠాత్తుగా 37,400 అడుగుల ఎత్తుకు దూసుకెళ్లడమే కాకుండా.. అంతేవేగంతో 24వేల అడుగుల దిగువకు పడిపోయిందని అన్నారు.

నిజానికి 32 వేల అడుగుల ఎత్తులో ఎగురుతున్న విమానాన్ని 38వేల అడుగుల ఎత్తుకు తీసుకెళ్లడానికి విమానం పైలట్, గ్రౌండ్ కంట్రోల్’ను అనుమతి కోరగా.. 34వేల అడుగుల ఎత్తుకు మాత్రమే తీసుకెళ్లడానికి అది అనుమతిచ్చింది. అయితే.. దీన్ని లెక్కచేయకుండా విమానాన్ని 37,400 అడుగులకు తీసుకెళ్లారని, అప్పుడు విమానం పైకి దూసుకుపోతున్నప్పుడు ఏటవాలుగా ఎడమవైపు ఒరిగిపోవడమే కాకుండా వణుకుతున్నట్లు రేడార్’లో కనిపించిందని ఆయన పేర్కొన్నారు. ఆ సమయంలో విమానం డ్యామేజ్ కావడంతో ఒక్కసారిగా 24వేట అడుగులకు పడిపోయిందని.. తర్వాత రేడార్ స్ర్కీన్ నుంచి అదృశ్యమైందని, అనంతరం సముంద్రంలో పడి కూలిపోయిందని ఎర్తాట లానంగ్ వివరించారు.

ఇదిలావుండగా.. అసలు ఉరుములు, మెరుపులు ఎక్కువగా వున్న ప్రాంతంలోకి విమానం ఎందుకు వెళ్లిందో తమకు ఇంతవరకు అంతుచిక్కడం లేదని.. దీనిపై ఇంకా దర్యాప్తు జరపాల్సిన అవసరం వుందని కమిటీ సభ్యులు పేర్కొన్నారు. గ్రౌండ్ కమిటీ ఇచ్చిన అనుమతి మేరకు కేవలం 34వేల అడుగుల మేరకు విమానాన్ని కో-పైలట్ తీసుకెళ్లివుంటే ఈ ప్రమాదం జరిగి వుండేది కాదేమోనన్న అభిప్రాయం వ్యక్తం చేశారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles