Telangana intermediate students state board jee examinations marks weightage problems

telangana intermediate students, telangana students, joint central examinations, jee examinations, telangana inter board, central board of secondary education, cbse news, telangana cm kcr, telangana education ministry

telangana intermediate students state board jee examinations marks weightage problems : telangana intermediate students getting weightage problems in jee examinations because of telangana state board option is not available.

ప్రత్యేకం : ఇంటర్ విద్యార్థులకు ఝలకిచ్చిన తెలంగాణ బోర్డు

Posted: 01/29/2015 11:15 AM IST
Telangana intermediate students state board jee examinations marks weightage problems

తెలంగాణ ప్రత్యేకరాష్ట్రం ఏర్పడి చాలాకాలం అయినప్పటికీ.. ఆ రాష్ట్ర బోర్డు చేసిన ఒక తప్పిదం ఇప్పుడు ఇంటర్ విద్యార్థులు అనుభవించాల్సి వస్తోంది. ప్రతిష్టాత్మక ఐఐటీ, ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీ విద్యాసంస్థల్లో అడ్మిషన్ల కోసం నిర్వహించే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (జేఈఈ) విషయంలో రాష్ట్రవిద్యార్థులకు తీవ్ర నష్టం వాటిల్లే పరిస్థితి నెలకొంది. ఎప్పుడో తన కార్యాన్ని పూర్తి చేయాల్సిన తెలంగాణ బోర్డు.. ఇప్పటివరకు చేయకపోవడంతో అది విద్యార్థులకు శాపంగా మారే ప్రమాదం ఏర్పడింది.

అదేమిటంటే.. ఇంటర్ బోర్డు జాబితాలో ‘తెలంగాణ ఇంటర్ బోర్డు’ను ఇంకా చేర్చకపోవడం వల్ల రాష్ట్ర విద్యార్థులకు తీవ్ర ఇబ్బందిగా మారింది. జేఈఈ దరఖాస్తుల్లో ‘తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు’ను ఎంపిక చేసుకునే వీలు లేకపోవడం వల్లే విద్యార్థులకు అది శాపంగా మారేందుకు కారణం! గత నవంబర్’లో జేఈఈ మెయిన్ దరఖాస్తుల జారీ సమయంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఏర్పాటు కాకపోవడంతో, ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ బోర్డు పేరుతోనే రాష్ట్రానికి చెందిన దాదాపు లక్షమంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్‌ఈ) చేపట్టిన ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఏపీ ఇంటర్ బోర్డు ఆప్షన్ మాత్రమే అందుబాటులో ఉంది. ఈ దరఖాస్తుల ప్రక్రియ ముగిసిన తర్వాత తెలంగాణ ఇంటర్ బోర్డును రాష్ర్ట ప్రభుత్వం ఏర్పాటు చేసినప్పటికీ తమ బోర్డును ప్రత్యేకంగా గుర్తించాలని సీబీఎస్‌ఈని కోరలేదు. తెలంగాణను ఆంధ్రప్రదేశ్‌తో కలిపి కాకుండా ప్రత్యేక యూనిట్‌గానే తీసుకోవాలని రాష్ర్ట ఇంటర్ బోర్డు అధికారులు కూడా సీబీఎస్‌ఈకి లేఖ రాయకపోవడం, విద్యాశాఖమంత్రి సైతం పట్టించుకోకపోవడంతో ఈ పరిస్థితి తలెత్తింది.

అయితే.. ఆన్‌లైన్ దరఖాస్తుల్లో వున్న కొన్ని పొరపాట్లను సవరించుకునేందుకు సీబీఎస్‌ఈ జవనరి 31వ తేదీ వరకు అవకాశం కల్పించారు. అయినా.. రాష్ట్రం నుంచి ఎలాంటి సమాచారం అందని కారణంగా తెలంగాణ స్టేట్ ఇంటర్మీడియెట్ బోర్డు ఆప్షన్‌ను ఇప్పటికీ పొందుపరచలేదు. దీంతో తెలంగాణ విద్యార్థులు తమ ఇంటర్ బోర్డును మార్చుకునే అవకాశం లేకుండా పోయింది. అసలు.. దీనివల్ల వాటిల్లే నష్టం అంతగా ఏముంటుందని అంతగా తీసిపారేయకండి.. దీంతో విద్యార్థులు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందో తెలుసా..?

జేఈఈ మెయిన్ పరీక్షల్లో వచ్చిన మార్కులతో ఇంటర్’లో విద్యార్థికి వచ్చిన మార్కులకు 40 శాతం వెయిటేజి ఇచ్చి.. పర్సంటైల్ నార్మలైజేషన్ చేసిన తర్వాత తుదిర్యాంకును ఖరారు చేస్తారు. దాని ఆధారంతోనే విద్యార్థులకు ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఇక ఐఐటీల్లో ప్రవేశాలు పొందాలంటే.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో విద్యార్థులు టాప్ ర్యాంకు సాధించడంతోపాటు ఆ రాష్ట్రం నుంచే ఇంటర్మీడియట్ పరీక్షలు రాసి వుండాలి... అలాగే 75 శాతం మార్కులు సాధించి వుండాలని సీబీఎస్‌ఈ నిబంధన!

అయితే.. తెలంగాణ రాష్ట్ర విద్యార్థులకు జేఈఈ మెయిన్ దరఖాస్తుల్లో ఆ రాష్ట్ర ఇంటర్ బోర్డు లేకపోవడంతో వారికి ఈ వెయిటేజీ నష్టం వాటిల్లనుంది. దరఖాస్తు ఫారంలో ఏపీ అని వుండి, వెయిటేజీ కోసం పంపించే వివరాల్లో తెలంగాణ ఇంటర్ బోర్డు విద్యార్థిగా వుంటే ఆయా విద్యార్థులకు వెయిటేజీ ఇవ్వరు. దీంతో వారికి సీటు దక్కే అవకాశం వుండదు. దీంతో విద్యార్థులంతా ఆందోళనల్లో మునిగిపోయారు.

ఇదిలావుండగా.. ఈ వెయిటేజీ ప్రమాద విషయాన్ని పసిగట్టిన తెలంగాణ బోర్డు.. దరఖాస్తుల్లో మార్పులకు ఇచ్చిన గడువును పొడిగించాలని, అందులో టీ-బోర్డు ఆప్షన్ చేర్చాలని కోరుతూ బుధవారం సీబీఎస్ఈకి లేఖ రాసింది. ఇప్పుడు ఈ విషయమై కేంద్రమంత్రి స్మృతి ఇరానీతో కేసీఆర్, విద్యాశాఖమంత్రి కడియం శ్రీహరి మాట్లాడి.. తమకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా చూడాలని విద్యార్థులు కోరుకుంటున్నారు. త్వరగా దీనిపై యాక్షన్ తీసుకుంటే.. తెలంగాణ విద్యార్థులకు ఊరట లభించే అవకాశం వుంది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles