Sunanda pushkar murder case rashtriya lok dal leader amar singh shashi tharoor delhi police

sunanda pushkar murder case, sunanda pushkar amar singh, sunanda pushkar sit team, sunanda pushkar shashi tharoor news, sunanda pushkar delhi police, amar singh sit, amar singh sunanda pushkar delhi police, sunanda pushkar shashi tharoor investigation, sunanda pushkar special investigating team, journalist Nalini Singh

sunanda pushkar murder case Rashtriya Lok Dal leader Amar Singh shashi tharoor delhi police : Delhi Police asked me about Sunanda Pushkar Shashi Tharoor relationship says Amar Singh after sit enquiry

సునంద కేసు: అమర్’సింగ్’ను సిట్ అడిగిన ప్రశ్నలివే!

Posted: 01/28/2015 06:08 PM IST
Sunanda pushkar murder case rashtriya lok dal leader amar singh shashi tharoor delhi police

కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్ భార్య సునందాపుష్కర్ గతేడాది జనవరి 17 తేదీన మరణించిన విషయం తెలిసిందే! అప్పట్లో ఆమె ఆత్మహత్య చేసుకుందని పోలీసులు భావించిన తరునంలో తర్వాత అనుమానాస్పద కేసుగా నమోదు చేయడం జరిగింది. ఇక అప్పటినుంచి విచారణలు చేపట్టిన చాన్నాళ్ల తర్వాత ఆమె మృతి కేసులో ఒక సరికొత్త మలుపు చోటు చేసుకుంది. ఆమె మరణం పాయిజన్’తో అయిందని తేలిన నేపథ్యంలో సిట్ దీనిపై దర్యాప్తు వేగవంతం చేసింది. ఈ నేపథ్యంలోనే సిట్ ఇటీవలే శశిథరూర్’ను విచారించడం జరిగింది కూడా! తాజాగా ఈ కేసులో రాష్ట్రీయ లోక్ దళ్ నేత అమర్ సింగ్ ను ఢిల్లీ పోలీసుల నేతృత్వంలో సిట్ విచారించడం జరిగింది.

దాదాపు రెండుగంటలపాటు అమర్ సింగ్’ను సిట్’ను విచారించింది. ఈ నేపథ్యంలో దర్యాప్తు అధికారులు ఆయన్ను 20 ప్రశ్నలు అడిగినట్లు సమాచారం! అయితే.. విచారణ ముగిసిన తర్వాత అమర్ వివరాలను వెల్లడించడానికి నిరాకరించారు. ప్రస్తుతం కేసులో దర్యాప్తు జరుగుతన్నందు వల్ల దీనిపై తనకు ఏ ప్రకటనా చేసే అధికారం లేదని ఆయన తేల్చి చెప్పేశారు. ఈ కేసు వెనుక దాగివున్న నిజానిజాలను సిట్ తేలుస్తుందని ఆయన అన్నారు. తనకు, సిట్’కు మధ్య విచారణ వివరాల గురించి పెదవి విప్పని ఆయన... థరూర్, సునంద మధ్య వున్న సంబంధం గురించి సిట్ తనను అడిగినట్లు చెప్పారు. అంతే! అదొక విషయం తప్ప ఆయన ఇతర వివరాను వెల్లడించలేదు.

మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ.. శశిథరూర్’నను తాను గౌరవిస్తానని, ఆయనకు వ్యతిరేకం కాదని తెలిపారు. ఈ కేసులో వాస్తవాలు బయటికి రావాలని తాను కోరుకుంటున్నట్లుగా తెలిపారు. సునంద గురించి తనకు తెలిసిన విషయాలను పోలీసులకు క్లుప్తంగా వివరించానని తెలిపారు. ఈ కేసులో మొదటిసారి తనను విచారణకు పిలిచారని పేర్కొన్న ఆయన.. తర్వాత ఎన్నిసార్లు పిలిచినా వస్తానని స్పష్టం చేశారు. కేసు చిక్కుముడి విడిపోయేవరకు తనవంతు సహాయాన్ని పోలీసులకు అందిస్తారని తెలిపారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles