Sania mirza bruno soares australia open tennis tournament mixed double

sania mirza news, sania mirza australia open, sania mirza photos, sania mirza medals, sania mirza australia tennis tournament, sania mirza photo shoot, sania mirza mixed double games, sania mirza bruno soares, sania mirza bruno soares mixed double

sania mirza bruno soares australia open tennis tournament mixed double : sania mirza bruno soares mixed double couple enters semi final by defeat unseeded couple with 6-2, 6-2 score.

పట్టిన పట్టు వదలకుండా.. పీల్చి పిప్పి చేస్తోంది!

Posted: 01/28/2015 02:14 PM IST
Sania mirza bruno soares australia open tennis tournament mixed double

భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా తానేంటో నిరూపించుకునేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇటీవలే వరుస విజయాలతో సుమారు అరడజనుకుపైగా టైటిళ్లను తన ఖాతాలో వేసుకున్న ఈ అమ్మడు.. అదే పట్టుదలతో అంతర్జాతీయ ఆటగాళ్లను పీల్చి పిప్పి చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇదివరకే తన ప్రతిభతో కొందరు క్రీడాకారులను వెనక్కు నెట్టేసిన ఈ అమ్మడు.. మరింత ఉన్నత స్థానంలో చోటు దక్కించుకునేందుకు ఎంతో కష్టపడుతోంది. అందుకే.. అందివచ్చిన అవకాశాలను ఏమాత్రం వదులుకోకుండా ముందుకు సాగిపోతోంది.

ప్రస్తుతం ఆస్ట్రేలియా ఓపెన్’లో ఆడుతున్న సానియా.. అక్కడ తన ప్రతిభతో ముందుకు సాగిపోతోంది. బ్రూనో సోరెస్’తో కలిసి సానియా మిక్స్’డ్ డబుల్స్’లో తన జోరును కొనసాగిస్తోంది. బుధవారం జరిగిన క్వార్టర్స్’లో టాప్ సీడ్ సానియా, బ్రూనో సోరెస్ జోడీ 6-2, 6-2 స్కోరుతో అన్-సీడెడ్ జోడీ డెలక్వా-జాన్ పీర్స్పై చాలా సింపుల్’గా విజయాన్ని సాధించారు. దీంతో సానియా జోడి అలవోకగా సెమీస్’లోకి చేరిపోయింది. అయితే.. ఈ ఆటలో సానియా ప్రదర్శించిన ప్రతిభ అందరినీ ఆశ్చర్యచికితుల్ని చేసింది. బ్రూనోకు అవకాశం ఇవ్వకుండా సానియా తన ప్రతిభతోనే స్కోరు చేసుకుంటూ ప్రత్యర్థులను ఓడించడంలో కీలకపాత్ర పోషించింది.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Rate This Article
(0 votes)
Tags : sania mirza australia open  bruno soares tennis star  

Other Articles