Telangana state finance minister etela rajender new schemes karimnagar districts

etela rajender news, etela rajender tours, finance minister etela rajender, telangana ministers, telangana government officers, government jobs holders

telangana state finance minister etela rajender new schemes karimnagar districts : finance minister etela rajender introduces new schemes for poor people in karimnagar districts.

ఉద్యోగుల వేతనం నుంచి తల్లిదండ్రులకు ఫించను!

Posted: 01/28/2015 12:54 PM IST
Telangana state finance minister etela rajender new schemes karimnagar districts

ప్రస్తుతరోజుల్లో డబ్బు విలువ ఎంతమేరకు వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు! డబ్బులకోసం కొందరు ఎంతటి దారుణానికైనా పాల్పడేందుకు సిద్ధపడుతుంటారు. ఆఖరికి తమ తల్లిదండ్రులను సైతం చంపేందుకు వెనుకాడరు. అంతటి దుస్సాహసం చేయలేని మరికొందరు.. ఆస్తికోసం తల్లిదండ్రులను నిత్యం హింసించడాన్ని పనిగా పెట్టేసుకుంటున్నారు. ఇక కొందరు ఉద్యోగస్తులైతే.. వేతనంతో జల్సాలు చేస్తుంటారు కానీ కుటుంబసభ్యులను ఏమాత్రం పట్టించుకోరు. అయితే.. ఇప్పుడు వారందరికీ బుద్ధి చెప్పేందుకు సిద్ధమయ్యారు ఆర్థికమంత్రి ఈటెల రాజేందర్.

ఉద్యోగం రాగానే అహంకారంతో తమ తల్లిదండ్రులను పట్టించుకోని ఉద్యోగస్తులకు గుణపాఠం నేర్పేందుకు ఈటెల రాజేందర్ ఓ మంచి ప్రతిపాదనను ప్రవేశపెట్టారు. ప్రభుత్వ ఉద్యోగులు తమ తల్లిదండ్రులను పట్టించుకోకపోతే.. వారి జీతాల నుంచి ఫించను చెల్లించేలా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. తల్లిదండ్రులతో సఖ్యతగా వుంటూ, వారి బాగోగులు చూసుకోవాలంటూ ఆయన ప్రభుత్వ ఉద్యోగస్తులను సూచిస్తున్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా జూపల్లి మండలం గర్రెపల్లిలో జరిగిన వివిధ కార్యక్రమాల్లో భాగంగా పాల్గొన్న ఈటెల... ఈ విధంగా పేర్కొన్నారు.

ఈ సందర్భంగానే ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఆడబిడ్డలకు కానుకగా నియోజకవర్గానికి కొత్తగా 5వేల గ్యాస్ కనెక్షన్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. రాష్ట్రప్రభుత్వంపై రూ.800 కోట్లు భారం పడుతున్నప్పటికీ.. విద్యార్థులకు నాణ్యమైన భోజనాన్ని అందించాలనే సంకల్పంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంటోందన్నారు. అంతేకాదు.. గుడిసెల్లో బతుకుతున్నవారికి 125 గజాల స్థలాన్ని కేటాయించడంతోపాటు రెండు పడకగదుల నిర్మాణం, గ్రామీణ ప్రాంతాల్లో 3.5 లక్షలతో అన్ని సౌకర్యాలతో కూడిన ఇల్లు నిర్మించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. మార్చి 1వ తేదీ నుంచి ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెడుతుందన్నారు.

AS

If you enjoyed this Post, Sign up for Newsletter

(And get your daily news straight to your inbox)

Other Articles